ప్ర‌మోష‌న్ చేసుకోవ‌డంలో ఆ హీరోయిన్‌కు సాటిలేదు…

-

దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అంటారు.  ఈ సామెత సినిమా ఇండ‌స్ట్రీలోని హీరోయిన్ల‌కు అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోతుంది.  వ‌చ్చిన చిన్న అవ‌కాశాల‌ను వ‌దులుకోకుండా,  సినిమాలు చేస్తుంటారు.  ఎందుకంటే, వారి కెరీర్ చాలా త‌క్కువ కాల‌మే ఉంటుంది.  ఉన్న స‌మ‌యంలో జీవితానికి స‌రిప‌డా సంపాదించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటారు.  ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా వాడేసుకుంటారు అన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.  దేశంలో బాలీవుడ్ అతిపెద్ద ఇండ‌స్ట్రీ కావ‌డంతో అక్క‌డి వారికి త్వ‌ర‌గా అవ‌కాశాలు, బ్రాండింగ్‌లు వ‌స్తుంటాయి.

క‌రణ్‌జోహార్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన అన‌న్య పాండే ప్ర‌స్తుతం బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ భారీ ఇంట్రీ ఇచ్చింది.  స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమెకు అవ‌కాశాలు రావ‌డం మొద‌ల‌య్యాయి.  పైగా మోడ‌లింగ్ రంగం నుంచి రావ‌డం ఆమెకు మ‌రింత క‌లిసి వ‌చ్చింది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసింది మూడు సినిమాలే.  సినిమాల  సంగ‌తి ఎలా ఉన్నా నిత్యం హాట్ హాట్ ఫొటో షూట్‌ల‌తో అభిమానులకు నిత్యం ఆమె ద‌గ్గ‌ర‌వుతూనే ఉన్న‌ది. ఇటీవ‌లే బ్లాక్ అండ్ బ్లాక్‌లో హాట్ హాట్‌గా ఫొటో షూట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  ఈ ఫొటోషూట్‌తో ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.  ఈ స్టార్ హీరోయిన్‌ ఇప్పుడు తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా చేస్తున్న లైగ‌ర్ సినిమాలో న‌టిస్తున్న‌ది.  ఈ మూవీ హిట్టైతే తెలుగులో ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు వస్తాయ‌న‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news