“జబర్దస్త్” కు అనసూయ గుడ్ బై?

యాంకర్ అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ కు గుడ్ బై చెప్పనట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్, ఇన్స్టా స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె జబర్దస్త్ ప్రోగ్రాం కు గుడ్ బై చెప్పనున్నట్లు అనిపిస్తుంది. నా కెరీర్లో అతి పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాను. దాన్ని ఈరోజు నుంచి అమల్లోకి తీసుకువస్తున్నాను. ఎన్నో స్వీట్ మెమోరీస్ ను నా వెంట తీసుకు వెళుతున్నాను. ఎన్నో మంచి మధురక్షణాలతో పాటు.. కొన్ని చేదు క్షణాలు కూడా ఉన్నాయి. కొన్ని వికార సంఘటనలు..

మొత్తానికి నాలో ఇప్పుడు మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ముందు ముందు నాకు ఎదురయ్యే వాటి కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. మీరంతా ఎప్పుడూ నాతోనే ఉంటారని ఆశిస్తున్నాను”. అని అనసూయ ఎమోషనల్ పోస్ట్ చేసింది. కాగా అనసూయ ఇప్పటికే ‘స్టార్ మా’ లో పలు షోలు చేస్తోంది. జబర్దస్త్ షో నుండి వెంటవెంటనే ఒకరొకరుగా స్టార్లంతా కూడా ఆ షో నుండి ఎందుకు బయటకు వస్తున్నారు అంతు పట్టడం లేదు.