బ‌న్నీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రంగమ్మత్త.. ఆ సారి కూడా..

-

యాంక‌ర్ అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంతలా ఆమె ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. ఇక పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ. ఇటు టీవి షోలు చేస్తూనే.. అటు సినిమాల్లో కూడా మంచి మంచి ఛాన్సుల‌తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు బ‌న్నీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ‌. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఆంధ్ర నేపథ్యంలో జరిగే కథే అయినప్పటికీ కేరళ అడవుల్లో చిత్రీకరిస్తున్నారు.

ఆల్రెడీ తొలి షెడ్యూల్ చిత్రీకరణను ఇటీవలే అక్కడ పూర్తిచేశారు. ఆ సమయంలో బన్నీ బిజీగా ఉండటం వలన, ఆయన కాంబినేషన్లో లేని సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్లో అల్లు అర్జున్ జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అనసూయ కూడా జాయిన్ కానుందని అంటున్నారు. ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మత్త’గా సుకుమార్ ఇచ్చిన పాత్రకి అనసూయ పూర్తి న్యాయం చేసింది. దాంతో ఆయన అదే తరహా పాత్రను బన్నీ సినిమాలోనూ ఇచ్చాడట. ఈ పాత్ర కూడా తనకి మరింత పేరు తెస్తుందనే ఆశాభావంతో అనసూయ ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news