బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత తన కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాలకు పెంచుకోవడం తో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా మెగా, నందమూరి హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా కలిసి నటిస్తున్న ఈ సినిమాపై తారా స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. డివివి దానయ్య అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి గా నటిస్తుండగా, ఎన్టీఆర్ తెలంగాణ విప్లవ వీరుడు కొమరం భీం గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఆలియా భట్,
హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను నిజానికి ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేస్తాం అని సినిమా యూనిట్ ఇప్పటికే పలు మార్లు చెప్పడం జరిగింది. అయితే నేడు కాసేపటి క్రితం జాతీయ మూవీ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పోస్ట్ చేసిన ఒక ట్వీట్ తో ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడ్డట్లు చాలావరకు సమాచారం అందుతోంది. ‘నేను కాసేపటి క్రితం ఒక సౌత్ ఇండియన్ బ్లాక్ బస్టర్ దర్శకుడి నుండి రాబోతున్న మరొక భారీ మూవీ గురించి ఒక న్యూస్ విన్నాను, ఆయన తీస్తున్న సినిమా విడుదల తేదీ మారింది, ఆ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు’, అయితే ఆ దర్శకుడు, అలానే అతను తీస్తున్న సినిమా ఏదో మీరే గెస్ చేయండి అంటూ తరణ్ ట్వీట్ చేసారు.
ఇప్పుడు ఇదే టోటల్ గా ఇండియాలో ఉన్న సినిమా ప్రేక్షకులను తీవ్ర అయోమయంలో పడేసింది. అయితే ఆయన ట్వీట్ కు వస్తున్న నెటిజన్ల స్పందనను బట్టి చూస్తే మెజారిటీ నెటిజన్లు మాత్రం అది ఆర్ఆర్ఆర్ మూవీ గురించే అని అంటుండగా, మరికొందరు అనలిస్టులు కూడా అది ఆ సినిమాకు సంబంధించిందే అని చెప్తున్నట్లు టాక్. అయితే కొందరు మాత్రం అది కెజిఎఫ్ చాప్టర్ 2 కి సంబందించిన న్యూస్ అని కూడా అంటున్నారు. ఏదిఏమైనా ఈ విషయమై ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ పోవాలంటే తరణ్ వీలైనంత త్వరగా నోరు విప్పకతప్పదు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మెగా, నందమూరి ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాకింగ్ వార్తే అనాలి…!!
#Xclusiv: Guess this one… The big film – being directed by the #Blockbuster director from South India – will have a new release date… According to sources, the biggie will now release in Oct 2020.
— taran adarsh (@taran_adarsh) January 18, 2020