ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంక‌ర్‌..!!

-

ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి కెమెరా ముందుకు రావడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. రాజకీయాలు ఎలా ఉన్నా కూడా తమ హీరో మళ్లీ సినిమాలపై ఫోకస్ చేయడం మాత్రం వాళ్లకు బాగా నచ్చేస్తుంది. ప్రస్తుతం ఒక సినిమా మాత్రమే చేసే అవకాశం ఉందని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన ఒక్కసారిగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘పింక్’ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలోని ఒక భారీ బడ్జెట్ సినిమాను చేయడానికి కూడా ఆయన అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్‌లోనే మొదలయ్యాయి కూడా. మ‌రోవైపు హరీశ్ శంకర్ వినిపించిన ఒక కథకి కూడా ఆయన పచ్చ జెండా ఊపాడు.

 

ఇదిలా ఉంటే.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న చిత్రాన్ని 100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రం బుల్లితెర హాట్ యాంక‌ర్ మంచి చాన్స్ కొట్టేసింది.క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకిగాను యాంకర్ అనసూయను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ‘రంగస్థలం’లో మాదిరిగా ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో అనసూయ రేంజ్ మారిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా నటిస్తున్నాడని సమాచారం. ఇప్పటి వరకు తన కెరీర్లో ఒక్కసారి కూడా పీరియాడికల్ సినిమా చేయని పవన్ కళ్యాణ్.. తొలిసారి క్రిష్ కాంబినేష‌న్‌లో ఈ సినిమా చేయబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news