నాగబాబు కొడుకుగా.. నిహారికకు అన్నయ్యగా వచ్చా.. సూర్యాకాంతం ఈవెంట్ లో విజయ్ దేవరకొండ..!

మెగా డాటర్ నిహారిక కొణిదెల లీడ్ రోల్ లో ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా సూర్యకాంతం. నిహారిక, రాహుల్ విజయ్ నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్ది గంటల క్రితం జరిగింది. యువ హీరో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ లో నాగబాబుతో తనకున్న  అనుభవాన్ని పంచుకున్నాడు విజయ్ దేవరకొండ. యూఎస్ లో వరుణ్.. పాలిటిక్స్ లో నాగబాబు గారు బిజీగా ఉండటం.. నిహారికకు తోడుగా నేను ఈ ఈవెంట్ కు ఓ అన్నయ్యగా వచ్చానని అన్నారు విజయ్ దేవరకొండ.

నాగబాబుకి కొడుకుగా.. నిహారికకు అన్నయ్యగా ఈ వేడుకకు వచ్చానని విజయ్ చెప్పడం అందరిని సర్ ప్రైజ్ చేసింది. కొద్దిరోజులుగా విజయ్, నిహారిక పళ్లని వార్తలు రాసిన వారందరికి ఇదే సమాధానంగా విజయ్ కామెంట్స్ ఉన్నాయి. సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం అంతా తెలిసినవారే అని సినిమా మార్చి 29న రిలీజ్ అవుతుందని.. సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని తనకి నమ్మకం ఉందని అన్నారు విజయ్ దేవరకొండ.