పెద్దపులితో శ్రీముఖి ఆటలు.. ఫిదా అవుతున్న అభిమానులు..

-

యాంకర్ గా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ శ్రీముఖి. ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటూ వస్తున్నారు. కాగా శ్రీముఖి ప్రస్తుతం బర్తడే మూడ్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తన బర్త్డేను థాయిలాండ్ లో సెలబ్రేట్ చేసుకున్న ఈ బ్యూటీ పులితో ఆడుకుంటున్న ఒక వీడియోను షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.

బుల్లి తెరపై యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి క్రేజ్ స్టార్ హీరోయిన్ తో సమానంగా ఉండడం చెప్పుకోదగిన విషయం. ఇప్పటికే ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న ఈ భామ సోషల్ మీడియాలో అయితే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. యాంకరింగ్ చేస్తూనే కోట్లలో సంపాదిస్తూ మరో వైపు నటిగా కూడా రాణిస్తుంది. తాజాగా హైదరాబాద్లో ఒక లగ్జరీ హౌస్ కొని సొంతింటి కలని సైతం నెరవేర్చుకుంది.

కాగా తాజాగా శ్రీముఖి చేసిన సాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా పెద్ద పులితో ఆటలాడారు. బర్త్ డే వేడుకల కోసం థాయిలాండ్ వెళ్లిన శ్రీముఖి ఫుకెట్ నగరంలో గల జూ పార్క్ సందర్శించారు. అక్కడున్న పెద్ద పులిని తాకుతూ ధైర్యం ప్రదర్శించారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులంతా శ్రీముఖికి ధైర్యం ఎక్కువ అంటూ పొగిడేస్తున్నారు..

article_image2

ప్రస్తుతం శ్రీముఖి అరడజనుకు పైగా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. పటాస్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ కొంత మేర సక్సెస్ అయిన నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆట తీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. ఈ షోలో విన్నర్ కన్నా శ్రీముఖికి ఎక్కువ రెమ్యూనరేషన్ వచ్చినట్టు అప్పుడు అప్పట్లో వార్తలు సైతం గట్టిగా వినిపించాయి.

ప్రస్తుతం శ్రీముఖికి యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ప్రయత్నిస్తూ క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news