పబ్లిక్‌గా యాంకర్​ సుమకు ప్రపోజ్ చేసిన కుర్రాడు.. వీడియో వైరల్

ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె కామెడీ టైమింగ్, పంచ్​ల పవర్​కి పెద్ద పెద్ద కమెడియన్స్ సైతం అవ్వాకైపోతారు. అందుకే ఆమె షోలో ఉంటే టీఆర్పీ రేసు గుర్రంలా పరిగెడుతుంది. ఇక ఆమె యాంకరింగ్​కు చిన్న పిల్లాడి నుంచి పెద్ద వయసు ఉన్న వారు కూడా ఫిదా అయిపోతుంటారు. ఇంతకీ ఆమె ఎవరో అర్థమైపోయింది కదా. ఆమెనె సుమ. అయితే ఆమెకు ఓ కుర్రాడు స్టేజ్​పైనే లవ్​ ప్రపోజ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే.. సుమ యాంకరింగ్‌లో ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘క్యాష్‌’.. దొరికినంతా దోచుకో.. ఈ వారం ఎపిసోడ్‌కు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ప్రభాస్‌ శ్రీను, హేమ, ప్రవీణ్‌, హరి తేజ అతిథులుగా వచ్చారు. సుమ ‘ఫిల్మ్‌ స్కూల్‌’ పేరుతో ఓ గేమ్​ కండక్ట్​ చేసి కామెడీ పండించారు. ఇక ప్రభాస్‌ శ్రీనును రొమాంటిక్‌ సీన్‌ డైరెక్ట్‌ చేయాలంటే.. అంతా గందరగోళం చేసి నవ్వులు పూయించాడు.

ఈ క్రమంలోనే సుమ.. కంటెస్టెంట్​లకు మరో టాస్క్​​ ఇచ్చింది. తాను చెప్పిన హావభావాలను పలికించాలని చెప్పింది. అలా హరితేజకు రకరకాలుగా ఏడవాలనే టాస్క్ ఇవ్వగా.. అప్పుడు హరి షోకి వచ్చిన ఆడియన్స్​తో చేయిస్తా అంటూ ఒక అమ్మాయికి చెప్పి చేయించింది. అది బాగా నవ్వులు పూయించింది. తర్వాత ప్రవీణ్​కి లవ్ ప్రపోజ్ చేసే టాస్క్ ఇచ్చింది. పార్క్​లో ఒక అమ్మాయి నిల్చొని ఉంటుంది. వెళ్లి ఐ లవ్ యు చెప్పాలని చెప్పింది. ఈ టాస్క్ కూడా షో ఆడియన్స్​లో ఒక అబ్బాయితో ప్రవీణ్ చెప్పి చేయించాడు. అలా సుమను లవర్​గా భావించి ఐ లవ్ యు చెప్పాలని ప్రవీణ్ ఆ అబ్బాయి చెప్పాడు.

దీంతో సుమ వద్దకు వెళ్లిన ఆ కుర్రాడు… మిమ్మల్ని చాలా రోజులుగా ఫాలో చేస్తున్నాను. మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ అని చెప్పాడు. ‘నువ్వు మా అబ్బాయి క్లాస్ మేట్ కదా’ అంటూ సుమ వెంటనే టైమింగ్ పంచ్ వేసింది. దీంతో షోలో ఉన్నవారంగా పక్కున నవ్వేశారు. సుమ టైమింగ్, సెన్సాఫ్ హ్యూమర్​కి నవ్వులు పూయించింది అలా ఈ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఫన్నీ ఫన్నీగా ఎంటర్​టైనింగ్​గా సాగింది. డిసెంబరు 3న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమోను మీరూ చూసేయండి.