తెలుగులో మూడో సీజన్ ప్రారంభం కాకముందే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. యాంకర్ శ్వేతారెడ్డిని కంటెస్టెంట్ గా తీసుకొని కమిటిమెంట్ అడిగారని.. ఆమె ఇదివరకే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అది బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్.. హిందీలో ప్రారంభమైన ఈ షో.. తర్వలోనే మిగితా భాషల్లోనూ ప్రారంభమయింది. తెలుగులోనూ రెండు సీజన్లను పూర్తి చేసుకొని మూడో సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది.
అయితే.. తెలుగులో మూడో సీజన్ ప్రారంభం కాకముందే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. యాంకర్ శ్వేతారెడ్డిని కంటెస్టెంట్ గా తీసుకొని కమిటిమెంట్ అడిగారని.. ఆమె ఇదివరకే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అది బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
సీజన్ 3లో పాల్గొనేందుకు తనను సంప్రదించారని.. ఎంపిక చేశారని ఆమె చెప్పింది. ఆ తర్వాత కమిట్ మెంట్ ఇవ్వాలని… తమ కోరిక తీర్చాలని వాళ్లు బలవంతపెట్టినట్టు ఆమె వెల్లడించింది. బిగ్ బాస్ ను మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారంటూ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారని.. బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేస్తేనే మీకు కంటెస్టెంట్ గా అవకాశం లభిస్తుందంటూ చెప్పారని ఆమె తెలిపింది.
అది బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్ అని.. కాస్టింగ్ కౌచ్ కు బిగ్ బాస్ కేంద్రంగా మారిందంటూ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. ఆ షోను రద్దు చేయాలని.. బిగ్ బాస్ ముసుగులో జరుగుతున్న వాటిని బయటపెట్టడానికే దైర్యం చేసి మీడియా ముందుకు వచ్చినట్టు శ్వేతారెడ్డి తెలిపారు.
బిగ్ బాస్ లో ఎంపికైన తర్వాత కార్యక్రమ సమన్వయకర్త రవికాంత్ తనకు చాలాసార్లు ఫోన్ చేసి పిలిపించి మాట్లాడారని… ఒప్పందం కోసం సంతకాలు కూడా చేశానని శ్వేతారెడ్డి తెలిపింది. అయితే… తనకు ఒప్పందం తాలూకు జిరాక్స్ కాపీలు మాత్రం తనకు ఇవ్వలేదని ఆరోపించింది.
తర్వాత తమ బాస్ ను ఇంప్రెస్ చేయాలని.. ప్రొడ్యూసర్ శ్యామ్ నన్ను అడిగారు. నేనెందుకు ఆయన్ను ఇంప్రెస్ చేయాలని నేను నిలదీశా. తర్వాత కంటెస్టెంట్ గా రావాలంటూ నాకు బిగ్ బాస్ నిర్వాహకులు రఘు, రవికాంత్, శ్యామ్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు.. అంటూ ఆమె బిగ్ బాస్ షోపై విమర్శలు చేశారు.