ర‌ష్మీ వ‌ర్సెస్ అన‌సూయ‌… ఒక‌ళ్ల‌ను మించి మ‌రొక‌రు చూపించేస్తున్నారు…

-

టాలీవుడ్‌లో హాట్ యాంక‌ర్లు అన్న ముద్ర వేయించుకున్న ర‌ష్మీ గౌత‌మ్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఇద్ద‌రు బుల్లితెర నుంచి వెండితెర‌మీద‌కు ఎంట్రీ ఇచ్చారు. సినిమా తెర‌పై ఓ వెలుగు వెలిగి పోవాల‌ని ఎన్నో క‌ల‌ల‌తో ఎంట్రీ ఇచ్చిన వీరిద్ద‌రు ఒక‌టీ అరా సినిమాల‌తో మెప్పించినా ఆ త‌ర్వాత వ‌రుస‌పెట్టి ప‌స‌లేని క‌థ‌ల‌ను ఎంచుకుంటూ సినిమాలు తీస్తూ ప్రేక్ష‌కుల‌ను విసిగెత్తిస్తున్నారు. చివ‌ర‌కు వీళ్లు క‌థాంశం ఉన్న సినిమాలు వ‌దిలేసి అందాల ఆర‌బోత‌కే ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.

తాజాగా వారం రోజుల వ్య‌వ‌ధిలో ఈ ఇద్ద‌రు న‌టించిన రెండు సినిమాలు వ‌చ్చాయి. ర‌ష్మీ శివ‌రంజ‌నీ గ‌త శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా ర‌ష్మీ ఎందుకు చేసిందో ? ఎవ్వ‌రికి తెలియ‌దు. సినిమాలో క‌థ‌, క‌థ‌నాల కంటే ర‌ష్మీ అందాల ఆర‌బోత‌కే ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు ఉంది. ఇక వాళ్లు కూడా త‌మ అందాలు చూసేందుకే ఓ టైప్ ప్రేక్ష‌కులు సినిమాల‌కు వ‌స్తార‌ని భావించి న‌ట‌న కంటే అందాలు చూపించేందుకు డిసైడ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక ఈ శుక్ర‌వారం అన‌సూయ న‌టించిన క‌థ‌నం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇండ‌స్ట్రీలో డైరెక్ట‌ర్‌గా మారాల‌నుకునే అమ్మాయిగా న‌టించింది. ఆమె కథనాన్ని ఎలా రాసుకుంటుందో.. నగరంలో అదే విధంగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ హత్యలకు, అనుకు ఉన్న సంబంధం ఏమిటి? అన్న కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్కించారు.సినిమా నిండా అనవసరమైన సన్నివేశాలు, ఇరికించినట్లు అనిపించే కామెడి.. ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి.

వెన్నెల కిషోర్‌తో చేయించిన కామెడీ లైన్‌ కూడా పెద్దగా నవ్వించలేకపోయింది. ఓవ‌రాల్‌గా అన‌సూయ త‌న హాట్‌నెస్ చూపించేందుకే తాప‌త్ర‌య ప‌డింద‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఏదేమైనా ఈ ఇద్ద‌రు హాట్ హీరోయిన్లు హాట్‌నెస్‌తో పోటీ ప‌డ‌డానికే సినిమాలు చేస్తున్న‌ట్టు ఉంద‌న్న సెటైర్లు టాలీవుడ్‌లో ప‌డుతున్నాయి. ఉన్నంత‌లో కాస్త అన‌సూయే న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లు చేస్తున్నా ర‌ష్మీ మ‌రీ ఘోరం.

Read more RELATED
Recommended to you

Latest news