అనిల్ రావిపూడి ఆశలు బాగానే ఉన్నాయి …అంత అవసరమా …?

-

డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం సూపర్ స్టార్ తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు హిట్ మంచి జోష్ మీద ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి, సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ మాదిరిగా వరుస హిట్స్ తో టాలీవుడ్ లో దూసుకువెళుతున్నాడు. ఇండస్ట్రీకొచ్చిన అతి క్ద్ది కాలంలోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంటున్నాడు. నందమూరి కళ్యాణ్ రాం తో తీసిన మొదటి సినిమా పటాస్ నుండి రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరూ వరకు అన్నీ సూపర్ హిట్స్ నే సొంతం చేసుకున్నాడు.

 

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్2 సినిమా సీక్వెల్ కి ఎఫ్3 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. మే నుండి ఎఫ్3 ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటిస్తాడని అంటున్నారు. అంతే కాదు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ తోని అనిల్ రావిపూడి సినిమా చేస్తాడన్న న్యూస్ బాగా వైరల్ అవుతోంది. సరిలేరు సక్సస్ తర్వాత వచ్చిన ఈ టాక్ ఇంకా ఆగనే లేదు. అయితే చరణ్ కి కథ కూడా ఇంకా అనిల్ రావిపూడి చెప్పలేదన్న న్యూస్ కూడా ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సక్సస్ ఫుల్ డైరెక్టర్ కి నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయాలన్న ఆలోచన ఉందట. బాలయ్య కోసం ‘రామారావు’ టైటిల్ తో కథ కూడా సిద్దం చేసి పెట్టుకున్నాడట. బాలయ్య అపాయింట్ మెంట్ ఇస్తే కలిసి కథ చెప్పాలనుకుంటున్నాడట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అంతేకాదు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ను తెరకి పరిచయం చేసే ఛాన్స్ కోసం కూడా ఆసక్తిగా ఉన్నాడట. మరి బాలయ్య అనిల్ రావి పూడికి ఈ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news