ముగ్గురు స్టార్ల‌ను లైన్‌లో పెట్టిన అనిల్ రావిపూడి.. అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

కామెడీ అయినా ఎమోష‌న‌ల్ అయినా యాక్ష‌న్ సీన్ అయినా ర‌క్తికట్టించేలా తీయ‌గ‌ల యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన అన్ని సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లే. ఒక్క ప్లాప్ కూడా లేని ఏకైక యంగ్ డైరెక్ట‌ర్ ఈయ‌నే. మ‌హామ‌హులైన డైరెక్ట‌ర్ల‌క కూడా అంతుచిక్క‌ని ఎలిమేష‌న్స్‌తో హీరోల‌ను ఎన‌ర్జిటిక్‌గా చూపిస్తుంటారు ఈయ‌న‌.

తాజాగా ఎఫ్‌-3సినిమాను వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌తో తీస్తున్నాడు. అయితే ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన ఆయ‌న ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఇలా కోలుకున్నాడో లేదో వ‌రుస‌బెట్టి స్టార్ హీరోల‌ను లైన్‌లో పెట్టేస్తున్నాడు. ఇప్ప‌టికే ముగ్గురు స్టార్ల‌ను క‌థ చెప్పి ఓకే చేయించుకున్నాడు.

ఎఫ్‌-3 త‌ర్వాత నందమూరి బాలకృష్ణతో ఆ త‌ర్వాత సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబుతో వ‌రుస‌గా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక వీరి త‌ర్వాత రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ కి క‌థ రాసుకుంటున్నాడు. వీట‌న్నింటినిపై ఆయ‌నే క్లారిటీ ఇచ్చేశాడు. పెద్ద డైరెక్ట‌ర్ల‌కు కూడా ఛాన్స్ ఇవ్వ‌ని హీరోలు ఈ యంగ్ డైరెక్ట‌ర్‌ను మాత్రం ఇట్టే న‌మ్మి సినిమాలు ఇస్తున్నారు. మ‌రి ఇన్ని బాధ్య‌త‌ల‌ను అనిల్ ఏ మేర‌కు మోస్తాడో చూడాలి. ఏదేమైనా టాలీవుడ్‌లో ఆయ‌న గ్రాఫ్ అమాంతం పెరిగిపోతోంది.