మాస్ లుక్‌లో అంజలి అదరగొట్టింది..చీరకట్టులో కుర్చీ మీద కాలు పెట్టి..

-

తెలుగమ్మాయి అంజలి..ఇప్పటి వరకు హోమ్లీ బ్యూటీగా ప్రేక్షకులను అలరించింది. కాగా, త్వరలో మాస్ లుక్ లో కనిపించనుంది. ‘బహిష్కరణ’ పేరుతో జీ5 ఓటీటీ వారు తీసుకొస్తున్న సిరీస్ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. అందులో అంజలి లుక్ చాలా డిఫరెంట్ గా ఉండటం విశేషం.

ఎప్పుడూ సాఫ్ట్ రోల్స్ ప్లే చేసే అంజలి..ఇందులో డిఫరెంట్ గా కనిపంచబోతున్నది. చేతిలో పాన్ డబ్బా..చీర కట్టులో అలా కుర్చీ మీద రాజసంగా కూర్చొని ఒక కాలును కుర్చీ పైన ఉంచింది. అంజలి లుక్ చూస్తుంటే డెఫినెట్ గా ఈ వెబ్ సిరీస్ లో అంజలి నెగెటివ్ రోల్ ప్లే చేసే చాయలు కనబడుతున్నాయి.

ఈ వెబ్ సిరీస్ ద్వారా అంజలి..తనలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించనుంది. ఇందులో ‘వకీల్ సాబ్’ ఫేమ్ అనన్య నాగళ్ల, రవీంద్ర విజయ్, శ్రీతేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంజలి ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. హోమ్లీ బ్యూటీ ఇలా మాస్ అవతారంలోకి ఎలా మారిపోయిందని ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news