అన్నే దండగ అనుకుంటుంటే.. తమ్ముడు వస్తున్నాడట..!

-

ఏ పరిశ్రమలో అయినా స్టార్ వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. అయితే స్టార్ వారసులే కాదు నిర్మాతల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నిలబడానికి నానా తంటాలు పడుతున్నాడు. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని శ్రీనివాస్ కు ఓ సూపర్ హిట్ ఇంతవరకు పడలేదు. సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ ను పెట్టినా మనోడికి లక్ కలిసి రావట్లేదు.

అయితే అన్న ఇంకా హిట్ ఖాతా తెరవలేదు. హీరోగా నిలదొక్కుకోలేదు ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడట. డెబ్యూ డైరక్టర్ తో గణేష్ సినిమా ఉంటుందట. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో గణేష్ నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. మరి అన్నే ఇప్పటివరకు పెట్టిన బడ్జెట్ రికవరీ అయ్యే హిట్ కొట్టలేదు. మరి తమ్ముడు వచ్చి ఏం చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news