బన్నిలో ఈ యాంగిల్.. సూపరంటే సూపర్..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలతో మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ప్రయోగాలకు ముందు ఉండే బన్ని ప్రతి సినిమా కొత్తగా ఉండేందుకు ట్రై చేస్తాడు. ఈ ఇయర్ నా పేరు సూర్యకు బాగా కష్టపడినా అందుకు తగిన ఫలితాన్ని అందుకోలేదు. త్వరలోనే త్రివిక్రం తో సినిమా ఎనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే కేవలం తన సినిమా అనే కాకుండా వేరే సినిమాలను ప్రశంసించడంలో ముందుంటాడు బన్ని.

ఈమధ్యనే రిలీజై యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని మంచి టాక్ తెచ్చుకున్న హుషారు సినిమా గురించి బన్ని ప్రస్థావించాడు. ప్రత్యేకంగా అందులో ఉండిపోరాదే సాంగ్ బన్నికి బాగా నచ్చిందట. అందుకే ఆ సాంగ్ బాగుందని తన ఇన్ స్టాగ్రాంలో సినిమా సంగీత దర్శకుడు రధన్, సింగర్ సిద్ శ్రీరాం కు తన అభినందనలు తెలియచేశాడు బన్ని. రధన్ సంగీతంతో పాటుగా సిద్ శ్రీరాం అద్భుతంగా ఈ పాట పాడాడని బన్ని కామెంట్స్ షేర్ చేశాడు.

మరి బన్ని లాంటి స్టార్ హీరో నుండి ఇలాంటి కామెంట్స్ రావడం హుషారు టీం కు గొప్ప విషయమే అని చెప్పాలి. కొద్దిగా ప్రమోట్ చేసి ఉంటే సినిమా ఇంకా బాగా ఆడేది. ఇప్పటికి యూత్ ఆడియెన్స్ కు ఈ సినిమా మంచి కిక్ ఇస్తుంది.

మరి బన్నిని అంతగా మెప్పించిన ఈ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి..

Read more RELATED
Recommended to you

Latest news