శాకుంతలంలో మరో స్టార్ హీరోయిన్..!

రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న మరో ప్రెస్టిజియస్ మూవీ శాకుంతలం. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ గా నటిస్తుంది. మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోశిస్తుందని తెలుస్తుంది. ఇంతకీ శాకుంతలం సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరు అంటే కోలీవుడ్ భామ ఆదితి బాలన్ అని చెబుతున్నారు. తమిళంలో వరుస సినిమాలతో ఫుల్ జోరు కొనసాగిస్తున్న అదితి బాలన్ తెలుగులో క్రేజీ ఛాన్స్ అందుకుంది.

Another Star Heroine Screening in Gunasekhar Shakunthalam

ముందు ఈ పాత్ర కోసం ఈషా రెబ్బని తీసుకోవాలని అనుకున్నారు. మరి ఆమె కాదందో లేక మేకర్స్ వద్దనుకున్నారో ఏమో కాని శాకుంతలం సినిమాలో మరో తమిళ భామకు ఛాన్స్ అందింది. శాకుంతలం సినిమాలో మళయాళ స్టార్ దేవ్ మోహన్ నటిస్తున్నాడు. సమంతకు జోడీగా అతన్ని ఫిక్స్ చేశారు. సినిమాలో కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు, గుణ టీం వర్క్స్ కలిపి నిర్మిస్తున్నారు. సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్లు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్.