బాల‌కృష్ణ ఫ్యాన్స్‌కు మ‌రో స‌ర్‌ప్రైజ్ రెడీ.. మాస్ కా బాస్‌!

బాల‌కృష్ణ‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కు పోటీగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ రోజు ఆయ‌న 61వ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో ఒక‌రోజు ముందే అఖండ సినిమా పోస్ట‌ర్ కూడ వ‌చ్చేసింది. క్లాస్ గా స్టైలిష్ లుక్ లో బాలకృష్ణ మెప్పిస్తున్నారు.

ఇక ఇప్పుడు మ‌రో సిన‌మా స‌ర్‌ప్రైజ్ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. బాలయ్య త‌న 107వ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అఖండ త‌ర్వాత మాస్ డైరెక్ట‌ర్ గోపిచంద్ మలినేనితో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే ఈ సినిమా క‌థ‌ను ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాస్తున్నాడంట గోపిచంద్. క్రాక్ సినిమా దారిలోనే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా యాక్ష‌న్ సీన్లు, ఇత‌ర కామెడీ సీన్లు రాస్తున్నాడ‌ని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ డ‌బుల్ రోల్ లో నటిస్తున్న‌ట్టు స‌మాచారం. మరి బాలకృష్ణ ఈ సినిమాతో తన మార్కెట్ ను ఏ స్థాయిలో పెంచుకుంటాడో వేచి చూడాలి.