ఏపీ సిఎం జగన్ కు రఘురామరాజు లేఖ

వైసీపీ రెబల్ ఎంపి రఘురామరాజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని.. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై కచ్చితంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల నుంచి రూ. 2750కి పెంచాలని కోరారు. ఏడాదిగా పెండింగ్లో ఉన్న వాటితో కలిపి మొత్తం మూడు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రఘురామరాజు. తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్ రూ. 2000ల నుంచి రూ. 3000 కు పెంచుతామని ఎన్నికల సమయంలో జగన్ పార్టీ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ హామీ కి ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించిందని.. అందుకే వైసిపి ఇంత భారీ మెజారిటీతో విజయం సాధించిందని తెలిపారు. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా తనపై మోపిన రాజద్రోహం సెక్షన్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే నేపథ్యంతో సిఎం జగన్ మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇటీవలే రఘురామరాజు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఏపీలో cid అధికారులు తనపై మోపిన రాజద్రోహం కేసుతో మొదలు పెట్టి ఆ తరువాత సీబీఐ కస్టడీలో దాడి ఇతర అంశాలను ఆయన లేఖలో పేర్కొన్నారు.