ఇన్నాళ్లకు అనుపమకు అర్ధమైందా..!

-

ప్రేమమ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ శతమానం భవతి హిట్ అందుకున్నా ఆ తర్వాత వరుస అపజయాలు ఎదుర్కుంటుంది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా హలో గురు ప్రేమ కోసమే సినిమా చేస్తుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను నక్కిన త్రినాథ రావు డైరెక్ట్ చేస్తున్నారు.

నేను లోకల్ తర్వాత దిల్ రాజు మళ్లీ అతనితో చేస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమా టీజర్ నిన్న రిలీజ్ చేశారు. టీజర్ లో అనుపమని చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు అనుపమ క్యూట్ గా ఆకట్టుకుంది. కెరియర్ లో మొదటిసారి అమ్మడు హాట్ హాట్ గా కనిపించింది. టీజర్ లో శాంపిల్ మాత్రమే చూపించగా సినిమాలో అనుపమ అసలు సిసలు అందాన్ని చూపిస్తుందని తెలుస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ ప్లాన్ చేశారు. రాం కు ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అనుపమ సోగయాల వల ఈ ప్రేమకథకు ఎలాంటి ఫలితాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version