గతంలో అరుంధతి, భాగమతి, బాహుబలి వంటి అద్భుతమైన సినిమాల్లో నటించి తన యాక్టింగ్ టాలెంట్ తో మంచి పేరు సంపాదించిన టాలీవుడ్ భామ అనుష్క. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరుగా దూసుకుపోతున్న అనుష్క, ప్రస్తుతం ఒక వైద్యభరితమైన సినిమాలో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిశ్శబ్దం అనే సినిమాలో ఆమె సాక్షి అనే మ్యూట్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల బయటకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

ఇక నేడు అనుష్క 37వ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ ని సినిమా యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే థ్రిల్లింగ్ మరియు సస్పెన్స్ అంశాలతో సాగుతుంది. అనుష్క మరియు మాధవన్ సహా మిగతా ప్రధాన నటీనటులందరినీ టీజర్ లో మనం గమనించవచ్చు. అయితే టీజర్ ను బట్టి ఒక హత్య నేపథ్యంలో జరిగే కథగా ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. అలానే మధ్యలో ప్రతి ఒక్కరినీ అనుమానించాలిస్తే అనే ట్యాగ్ లైన్ కనపడుతుండడంతో,తప్పకుండా ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఆడియన్స్ ని థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటుందని అర్ధం అవుతోంది.
థ్రిల్లింగ్ సీన్స్, యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు, ఆసక్తిని రేకెత్తించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ గా ఉన్న విజువల్స్, వెరసి ఈ టీజర్ ని మంచి సక్సెస్ చేయడంతో పాటు, సినిమా పై ప్రేక్షకుల్లో అమాంతం అంచనాలు పెంచేశాయనే చెప్పాలి. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతాన్నిఆ అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది…..!!