ఏపీలో ఇసుక కొతర అంశం కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఈ క్రమంలోనే విపక్షాలు సైతం సీఎం జగన్మోహన్‌రెడ్డిపై ఇదే అంశంలో తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇసుక అంశంపై ఈ రోజు జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జగన్ ఇసుక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం తీసుకువచ్చేలోగానే ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
జిల్లాలు, నియోజకవర్గాల వారిగా ధలను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోలీసు, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ఇసుకను ఏ జిల్లాలో ? ఏ నియోజకవర్గంలో ఎంత రేటు పెట్టాలో కూడా ముందుగానే రేట్లు నిర్ణయించాలని చెప్పారు. ఈ రేట్లను ఆయా జిల్లాల కలెకక్టర్లతో మాట్లాడి రేట్లు నిర్ణయించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ఇసుకను అమ్మాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ రేట్లకు అమ్మడానికి వీల్లేదని.. ఇంకా చెప్పాలంటే ఇసుక స్మగ్లింగ్‌ను అరికట్టాలని… అలా జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా చెప్పారు.
మొత్తం 275 ఇసుక రీచ్‌లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని… ఇసుక సరఫరాకు పుష్కలంగా వాహనాలు అందుబాటులో ఉంచాలని.. కిలోమీటర్‌కు ఇసుక సరఫరా చేసేందుకు రు 4.90 కు ఎవరు ముందుకు వచ్చినా వారికి వెంటనే అనుమతులు ఇవ్వాలని కూడా జగన్ సూచించారు. ఈ నెలాఖరు నాటికే ఇసుక రీచ్‌ల వద్ద కెమేరాలు, వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.
ఇక తాను జూన్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేశానని… ఆగస్టు నుంచే వరదలు ప్రారంభమయ్యాయని ఇప్పటి వరకు వరదలు కంటిన్యూగానే ఉన్నాయని… ఇక ఏ ఇష్యూ లేక ప్రతిపక్షాలు ఈ ఇష్యూ తీసుకుని వరద రాజకీయాలు చేస్తన్నాయంటూ జగన్ దుయ్యబట్టారు. ఏదేమైనా ఇసుక విషయంలో జగన్ చాలా స్ట్రిక్ట్‌గా ముందుకు వెళుతున్నట్టే కనిపిస్తోంది. ఇక వచ్చే వారం స్పందనలో మొత్తం ఇసుక గురించే చర్చ జరగాలని కూడా ఆయన డిసైడ్ అయ్యారు. ఇకపై ఏసీలో ఇసుక కొరత అంశానికి ఆయన ఫుల్‌స్టాప్ పెట్టేయనున్నారు.