సైరా నరసింహా రెడ్డి చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో అనుష్కతో స్టెప్పులేయించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. త్వరలోనే ఆమె ఈ సాంగ్ షూటింగ్‌లో పాల్గోననుందటని తెలుస్తుంది.
అరుంధతి, బాహుబలి, భాగమతి చిత్రాల్లో లేడీ ప్రధాన పాత్రల్లో నటించి మైమరపించిన అనుష్క ఇప్పుడు మరోసారి అందాల ఆరబోతకు సిద్ధమవుతుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె మరోసారి చిరంజీవి సరసన ఐటెమ్ సాంగ్ చేయబోతుందట. గతంలో స్టాలిన్ సినిమాలో ఐ వన్నా స్పైడర్ మ్యాన్ అంటూ చిరంజీవితో స్టెప్పులేసి మంత్రముగ్ధుల్ని చేసింది.
ఆ తర్వాత నాగార్జున నటించిన కింగ్, కేడీ ఫిల్మ్స్ లో ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడింది. తనదైన అందం, అంతకు మించిన అభినయంతో మెస్మరైజ్ చేసింది. తాజాగా సైరా నరసింహా రెడ్డి చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో అనుష్కతో స్టెప్పులేయించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. త్వరలోనే ఆమె ఈ సాంగ్ షూటింగ్‌లో పాల్గోననుందటని తెలుస్తుంది. ఇటీవల కోకపేటలో వేసిన సైరా సెట్ అగ్నికి ఆహుతి అయిన విషయం విదితమే. త్వరలో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కి ప్లాన్ చేశారు.
అద్బుత నటనతోనే కాదు, అందాలతో మరోసారి ఆడియెన్స్ ని అబ్బుర పరచనుందని తెలుస్తుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఆయన సరసన నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే అనుష్క ప్రస్తుతం సైలెంట్ అనే ఓ మూకీ సినిమా చేస్తుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్‌గానే ఉంటుందని తెలుస్తుంది.