అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

-

వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా జరుపుకొంటారు. అక్షయ అనే శబ్దానికి అర్థం ఎప్పుడూ నిలిచి ఉండేది. నాశనం లేనిది. స్థిరంగా ఉండేది అని సత్యమైనదే నిత్యం ఉంటుంది. శాశ్వతంగా ఉండేదని అర్థం. ఈ రోజును స్వయం సిద్ధ ముహూర్తంగా కూడా జ్యోతిష శాస్త్రం అభివర్ణించింది.

Do you know how it got akshaya tritiya name

అక్షయ తృతీయ ప్రత్యేకతలు

– నాలుగు యుగాల్లో త్రేతాయుగం అక్షయ తృతీయనాడే ప్రారంభమైంది.
– దీన్ని యుగారంభ తిథి అని ఉగాది తిథి అని కూడా పిలుస్తారు
– ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బదరీలో దేవాలయం ఆరునెలలు మూసి తిరిగి అక్షయ తృతీయనాడే ఆలయం తెరుస్తారు. ఈరోజు బదరీనాథుడి దర్శనం, జ్యోతి దర్శనం చేయడానికి లక్షల్లో జనం ఇక్కడికి వస్తారు.
– విశాఖపట్నంలోని సింహాచలం క్షేత్రం అంటే సింహాద్రిలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవాన్ని అక్షయ తృతీయనాడే నిర్వహిస్తారు.
– వేదవ్యాసుడు, వినాయకుడు కలిసి మహాభారత రచనకు ఉపక్రమించినది అక్షయ తృతీయనాడే.
– గంగాదేవి భూమిపై అవతరించినది అక్షయ తృతీయనాడే.

అక్షయ తృతీయ ఈ పురాణాల్లో ఉంది!

అక్షయ తృతీయ గురించి విస్తృతమైన వర్ణనలు విష్ణుధర్మ సూత్రాలు, మత్స్య పురాణం, నారదీయ పురాణం, భవిష్య పురాణాల్లో ఉంది.

ఈ రోజు ఎవరి జయంతి నిర్వహిస్తారో తెలుసా…?

అక్షయ తృతీయ రోజున పరమాత్మ వివిధ అవతారాలు ఆవిర్భవించిన దివ్యమైన రోజు. ఈ రోజున నరనారాయణులు అంటే కలియుగా వేదాలను పరిరక్షిస్తున్న మహానుభావులు జన్మించిన తిథి అందుకే దీన్ని నరనారాయణ జయంతిగా నిర్వహించుకుంటారు.

– మేధస్సుకు, జ్ఞానానికి ప్రతీకగా నిలిచే విష్ణు అంశ హయగ్రీవుడు కూడా ఈ రోజునే ఆవిర్భవించాడు. అందుకే దీన్ని హయగ్రీవ జయంతిగా జరుపుకొంటారు.

– చిరంజీవుల్లో ఒకరైన పరుశరాముడు ఈ తదియనాడే జన్మించారు. కాబట్టి దీన్ని చిరంజీవి తిథి అని పరుశరామ జయంతిగా కూడా జరుపుకొంటారు.

అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి?

వైశాఖ శుక్ల తదియనే అక్షయ తృతీయగా పిలుస్తారు. అపరిమితమైన అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే తిథి అని అర్థం. అందుకే ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువును, మహాలక్ష్మీని పూజించడం వల్ల సిరిసంపదలు విశేషంగా వస్తాయని ప్రతీతి. ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా తప్పక విజయం సాధిస్తారని పండితుల ఉవాచ. నారసింహ అవతారంలో ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజు కాబట్టి విష్ణువుని లేదా నారసింహుడిని ఆరాధిస్తే చాలు తప్పక విజయాలు, అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొన్నాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news