ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సినిమాల ప్రత్యేక షోలు.. టిక్కెట్ల ధర తగ్గింపు వంటి నిర్ణయాల
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా స్పందించాడు. సినిమా టికెట్ల పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని అన్నారు. తనకు సినిమా ఇండస్ట్రీ లో 45ల అనుభవం ఉందని.. నా అభిప్రాయాలను పరిగణ లోకి తీసుకోవాలని కోరారు. సాధారణ ప్రజలకు ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేది కేవలం సినిమా మాత్రమే అని అన్నారు.
సినిమా ను థీయేటర్ లో చూసిన అనుభూతి టీవీ లో చూస్తే రాదు అని అన్నారు. బెనిఫిట్ షో లు.. టికెట్ రేట్లు తగ్గించటం వల్ల అందరూ నష్టపోతారని తెలిపారు. తీసిన అన్ని సినిమా లు హీట్ కావని కేవలం 10 శాతం సినిమాలు మాత్రమే హిట్ అవుతాయని అన్నారు. ఆన్ లైన్ విధానం తో దోపిడీ ఆగిపోతుంది అని అనటం కరెక్ట్ కాద ని తెలిపారు. సినిమా మంచి గా ఉంటే ప్రేక్షకుడు రూ. 300 నుంచి రూ. 500 వరకు ఖర్చు చేసి చూస్తాడని అన్నారు.
ఇక వేల ప్రేక్షకులకు సినిమా నచ్చకపోతే టికెట్ ధర రూపాయి ఉన్నా.. చూడడని అన్నారు. ఆన్ లైన్ విధానం వల్ల కొంత మంది బ్లాక్ లో టికెట్ లు అమ్మే అవకాశం ఉందని సూచించారు. కాగ రాఘవేంద్ర రావు చేసిన ట్విట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీని పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో చూడాలి.
— Raghavendra Rao K (@Ragavendraraoba) December 1, 2021