అరవింద సమేత అక్కడ నిరాశే..!

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత అంచనాలకు తగినట్టుగానే వచ్చింది. ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. అయితే యూఎస్ లో మాత్రం ఈ సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అవలేకపోయింది. కాంబినేషన్ చూసి కాసులు కురిపిస్తుందని భావించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు అరవింద సమేత కొద్దిపాటి నష్టాలు మిగిల్చింది.

సినిమాను యూఎస్ లో 2.5 మిలియన్ డాలర్స్ కు కొన్నారు. అయితే ఇప్పటివరకు యూఎస్ లో 2.17 మిలియన్ డాలర్స్ మాత్రమే వసూళు చేసింది ఈ సినిమా. త్రివిక్రం మార్క్ కామెడీ లేకపోవడం యూఎస్ ఆడియెన్స్ కు నచ్చకపోడానికి ఓ కారణం అని తెలుస్తుంది. పవర్ స్టార్ అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా సరే యూఎస్ లో 2 మిలియన్ క్రాస్ చేసింది.

త్రివిక్రం డైరెక్ట్ చేసిన అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత 3 సినిమాలు 2 మిలియన్ మార్క్ క్రాస్ చేశాయి. అయితే వీటిలో అఆ మాత్రం సూపర్ హిట్ అనొచ్చు. అరవింద సమేత ఓవరాల్ కలక్షన్స్ కూడా డీసెంట్ గా ఉన్నా బ్లాక్ బస్టర్ మూవీ మాత్రం కాదని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news