కట్టలు తెంచుకున్న జియో వినియోగదారుల ఆగ్రహం.. సోషల్ మీడియాలో నిరసనలు..!

-

అసలేంజరిగింది అంటే.. 827 వెబ్ సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. అవి ఏ వెబ్ సైట్లో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో.. వాటిని బ్యాన్ చేయడం కోసం ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లకు ఆర్డరేసింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి ఉత్తరాఖండ్ హైకోర్టు 857 వెబ్ సైట్లను బ్లాక్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సూచించినా.. అందులో 30 వెబ్ సైట్లలో అడల్ట్ కంటెంట్ ఏదీ లేదని.. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలిపింది. దీంతో టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్ మెంట్ వెంటనే 827 వెబ్ సైట్లను బ్లాక్ చేయాలంటూ అన్ని ఐఎస్పీలకు తెలిపింది.

అయితే.. అన్నింటి కన్నా ముందే ఎక్కువ యూజర్లున్న రిలయెన్స్ జియో ఈ వెబ్ సైట్లను బ్లాక్ చేసింది. అదే ఇప్పుడు అసలు సమస్య అయింది. అరె.. ఆ ఎయిర్ టెల్, వొడాఫోన్ నెట్ వర్కులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అప్పుడే జియో ఇంత వేగంగా స్పందించడమేంటని యూజర్లు తెగ ఫైరయిపోతున్నారు. జియో యూజర్లకు ఇప్పుడు ఆ వెబ్ సైట్లు ఓపెన్ కాకపోవడంతో పిచ్చెక్కిపోతున్నారు. తాము జియో డేటా వేయించుకునేదే ఆ వెబ్ సైట్ల కోసమని.. ఇప్పుడు వాటినే బ్లాక్ చేస్తే తమ పరిస్థితి ఏంటంటూ వాపోతున్నారు. జియో తొందర పాటు నిర్ణయం వల్ల తనే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతే కాదు తమ నిరసనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అది మ్యాటర్. మరి.. నెటిజన్లు తమ బాధను సోషల్ మీడియాలో ఎలా వ్యక్తపరిచారో మీరే చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news