అరవిందకు ఆ సినిమాతో పోలిక లేదు

-

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వతున్న అరవింద సమేత సినిమా ముందు నుండి ఓ సినిమాకు పోలిక పెడుతూ వచ్చారు. అదే కోబలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రం చేద్దామనుకున్న సినిమా అది. కోబలి టైటిల్ గా అప్పట్లో ఓ లైన్ ఇండస్ట్రీలో చర్చ నడిసింది. ఫ్యాక్షన్ ఎక్కడ మొదలైంది.. ఎంతగా వ్యాపించింది అన్న కథాంశంతో కోబలిని ఓ ఆఫ్ బీట్ సినిమాగా తీయాలనుకున్నాడు త్రివిక్రం.

అయితే అరవింద సమేత కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ కావడం.. ఆ సినిమాకు ఈ కథకు పోలిక ఉండటం వల్ల అరవింద సమేతకు కోబలికి లింక్ పెట్టారు. అయితే ఈ న్యూస్ త్రివిక్రం దాకా వెళ్లడంతో అసలు అరవింద సమేతకు.. కోబలికి సంబంధమే లేదని చెప్పాడు. ఆ కథ వేరు.. ఈ కథ వేరు.. కోబలిలో అసలు పాటలు లేకుండా ఆఫ్ బీట్ సినిమాగ తీయాలనుకున్నట్టు చెప్పారు త్రివిక్రం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version