నాగార్జున అక్కడ ముట్టుకోవడంతో రాత్రంతా అంటూ.. సిగ్గుపడుతున్న కస్తూరి..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్రీకు వీరుడిగా..కలల రాకుమారుడుగా.. మన్మధుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున. ఆరుపదల వయసులో కూడా ఈతరం హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ ఎంతోమంది అమ్మాయిల హృదయాలను దోచుకున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా నాగార్జున అంటే ఇప్పటికీ కూడా చాలామంది అమ్మాయిలలో క్రేజ్ ఉంటుంది అయితే అప్పట్లో ఒక హీరోయిన్ నాగార్జున అంటే పడి చచ్చిపోయేదట..ఆమె ఎవరో కాదు కస్తూరి. వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె మళ్లీ వెండితెరపై కనిపించలేదుఇప్పుడు బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చి మన సీరియల్స్ లో తనదైన ముద్ర వేసుకుంది అలనాటి హీరోయిన్ కస్తూరి.

ఈమె ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. నిజానికి కస్తూరి నాగార్జునతో అన్నమయ్య సినిమాలో జంటగా నటించింది. ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ.. నేను నాగార్జున గారిని చూసిన మొదటి చూపులోనే పడిపోయాను. ఆయనంటే పిచ్చి అంటూ చెప్పుకొచ్చింది. ఇక నాగార్జునతో అన్నమయ్య, ఆకాశవీధి వంటి సినిమాలలో నటించాను అని తెలిపింది కస్తూరి. ఇదిలా ఉండగా అన్నమయ్య షూటింగ్ సమయంలో నాగార్జున నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.ఆరోజు మొత్తం నా చేతిని ఎవరిని ముట్టుకోనివ్వకుండా జాగ్రత్త పడ్డాను అంటూ నాగార్జున పై తనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చింది కస్తూరి.అంతేకాదు దిల్ సినిమాలో నితిన్ లాగా తాను కూడా రాత్రంతా చెయ్యి చూస్తూ అలాగే పడుకుండిపోయాను అంటూ తెలిపింది కస్తూరి . ఇక కస్తూరి అప్పట్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా గ్లామర్ తో మతి పోగొట్టే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.