ఆ సమయంలో డిప్రెషన్ తో చనిపోదామనుకున్నా.. హృతిక్ రోషన్

-

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఉన్న ఫాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఏదైనా శరీరానికి ఫిట్నెస్ కు అభిమానులు పడి చస్తూ ఉంటారు అయితే ఇది సాధించడం కోసం తాను ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చారు ఈ హీరో..

బాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ఈ వయసులో కూడా ఎనిమిది పలకల దేహంతో అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు అలాగే ఇప్పుడు ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాను అంటూ చెప్పుకొస్తారు అయితే ఇందుకోసం తను ఎంతో కష్టపడతానని తెలిపారు అలాగే గతంలో ఇలా శరీరాన్ని ఒక ఆకృతిలోకి తేవడానికి కష్టపడి డిప్రెషన్కు గురయ్యానని తెలిపారు..

తాజాగా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ క్రిస్‌ గెతిన్‌ చేసిన ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. “గతంలో వార్ సినిమాలో నటించాను అయితే అప్పుడు ఆ సినిమాలో ఉన్న పాత్రకి తగినట్టుగా నా దేహం లేదు అందుకు తగినట్టు నా శరీరాకృతిని మార్చుకోవడం నాకు నిజంగా సవాలుగా అనిపించింది కానీ పాత్ర కోసం చాలా ప్రయత్నించా పర్ఫెక్షన్ కోసం ఎంతగానో ట్రై చేశా.. అయితే సినిమా చిత్రీకరణ పూర్తయ్య సమయానికి పూర్తిగా అలసిపోయాం. ఒకానొక సమయంలో డిప్రెషన్ అంచుల వరకు వెళ్లొచ్చా ఆ సమయంలో చనిపోవాలి అనే ఆలోచనలు కూడా వచ్చాయి అప్పుడే నాకు జీవితంలో మార్పు అవసరమని మారాలని అర్థమైంది.. ” చెప్పుకొచ్చారు హృతిక్ రోషన్.. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన వార్‌లో హృతిక్‌తోపాటు టైగర్‌ ష్రాఫ్‌ కీలక పాత్ర పోషించారు. వాణీ కపూర్‌ కథానాయిక. ఈ సినిమా 2019 అక్టోబరు 2న విడుదలైంది. ఇందులో హృతిక్‌ రా ఏజెంట్‌గా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news