విజయ్ దేవరకొండపై ప్రేక్షకుల తిరుగుబాటు

-

ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకోని హీరోలున్న టాలీవుడ్ లో చేసిన నాలుగు సినిమాల్లో 3 సూపర్ హిట్లు కొట్టిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ నోటా అంచనాలను అందుకోలేకపోయింది. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ లో జ్ఞానవెల్ రాజా నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణా మూడు రాష్ట్రాల్లో తిరిగిన విజ దేవరకొండ ఫ్యాన్స్ కు ఈ సినిమా మీ అందరని అలరిస్తుంది అంటూ ప్రమాణం చేశాడు.

అయితే సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. విజయ్ ఇలాంటి సినిమాతో పక్కా హిట్ కొడతా అంటూ చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ ఆంధ్రా అభిమానులు కొందరు అతని మీద రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాబోతున్న టాక్సీవాలా సినిమా మీద కూడా విజయ్ పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపించడం లేదు.

నోటా ఫ్లాప్ అవగా టాక్సీవాలా ఆల్రెడీ లీక్ బాట పట్టడంతో ఆ సినిమా మీద అంత ఆసక్తి కనిపించడం లేదు. మరి విజయ్ తన కెరియర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version