‘బాహుబలి – 2’ సినిమాకు ఘోర అవమానం….!!

-

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి అత్యద్భుతంగా ఎంతటి విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. అంతేకాక తెలుగు సినిమా ఖ్యాతిని దేశవిదేశాల్లో కూడా ఇనుమడింప చేసిన ఈ సినిమా తరువాత తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు రావడం మొదలయ్యాయి. ఇక బాహుబలి 2 సినిమా ఏకంగా రూ.2000 కోట్ల వరకు కలెక్షన్ ని రాబట్టింది. ఇకపోతే నిన్న, ప్రఖ్యాత యాహు ఇండియా సంస్థ ఈ దశాబ్ద కాలపు బెస్ట్ మూవీ ఏది అంటూ నిర్వహించిన ఒక రివ్యూలో చేర్చబడిన పది సినిమాల లిస్ట్ లో బాహుబలి 2 లేకపోవడం అందరిని ఎంతో ఆశ్చర్యపరిచింది.

ఆ లిస్ట్ లో దంగల్, భజరంగి భాయి జాన్, సుల్తాన్, టైగర్ జిందా హై తదితర సినిమాలన్నీ ఉన్నప్పటికీ, వాటన్నిటికీ మించేలా అద్భుత విజయాన్ని అందుకున్న మన బాహుబలి 2 లేకపోవడం ఒకరకంగా మన తెలుగు సినిమాలను బాలీవుడ్ వారు అవమానించడమే అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ రివ్యూ లో అత్యధిక రేటింగ్స్ తో అమీర్ ఖాన్ నటించిన దంగల్ మొదటి స్థానంలో నిలించింది.

 

కాగా కెలెక్షన్స్ పరంగా చూసుకుంటే దంగల్ కు మరియు బాహుబలి 2కు కేవలం అత్యల్ప తేడా మాత్రమే ఉందని, అన్నికంటే ముఖ్యంగా దంగల్ సినిమా ఇండియాయేతర దేశాల్లో బాగా కలెక్షన్ రాబట్టిన సినిమాగా నిలవగా, బాహుబలి 2 ఇండియా మొత్తంలో అత్యధిక కలెక్షన్ సంపాదించిన సినిమాల్లో టాప్ నెంబర్ వన్ గా నిలిచిందని, మరి అటువంటి సినిమాని యాహు వారు ఎందుకు ప్రక్కన పెట్టారో తమకు అర్ధం కావడం లేదని పలువురు ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version