డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు బ్యాడ్‌టైమ్‌.. డైన‌మాలో దిగ్గ‌జం!

-

సౌత్ ఇండియాలోనే శంక‌ర్ అంటే ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌. ఆయ‌న సినిమాల‌న్నీ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న‌మే. ఆయ‌న‌తో సినిమా చేసేందుకు హీరోలు క్యూ క‌ట్టేవారు. అలాంటి డైన‌మిక్ డైరెక్ట‌ర్ ఇప్పుడు క‌ష్టాల్లో ప‌డ్డారు. రోబో త‌ర్వాత ఆ స్థాయి హిట్‌కొట్ట‌లేదు. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్‌తో చేస్తున్న ఇండియ‌న్‌-2 వివాదంతో తీవ్ర నిరాశ‌లో ఉన్నారు.

లైకా నిర్మాణ సంస్థతో విభేదాలు రావ‌డంతో ఆ సినిమాను ప‌క్క‌న పెట్టేశాడు. వెంట‌నే రామ్ చ‌ర‌ణ్‌తో ఓ ప్యాన్ ఇండియా మూవీ, బాలీవుడ్ హీరోర‌ణ్‌వీర్ సింగ్‌తో అప‌రిచితుడు రీమేక్‌ల‌ను చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

కానీ లైకా సంస్థ కోర్టుకు వెళ్ల‌డం, అన్ని ఫిల్మ్ ఛాంబ‌ర్ల‌కు లేఖ‌లు రాసి శంక‌ర్ త‌మ సినిమా తీసేంత వ‌ర‌కు ఎలాటి సినిమా తీయకుండా చూడాలంటూ కోరారు. దీంతో ఈ రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయి. దీంతో శంక‌ర్‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అన్నింటికీ త‌గ్గి లైకాతో కలిసి సినిమా చేస్తారా లేక వేరే మార్గాన్ని ఎంచుకుంటారో చూడాలి. ఏదేమైనా ఒక‌ప్ప‌టి దిగ్గజ ద‌ర్శ‌కుడికి బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news