వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసుకి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రఘు రామ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ తరుపు లాయర్ దవే కీలక వాదనలు వినిపిస్తున్నారు. ఈ బెయిల్ పిటిషన్ కొట్టేయడానికి చాలా కారణాలు చెబుతాను అని అన్నారు. రెండు చానల్స్ రఘురామ రాజుని కావాలని రెచ్చగోట్టాయి అని ఆయన వాదించారు. ఆర్మీ ఆస్పత్రి తయారు చేసిన రిపోర్టును మేం తప్పుబట్టడం లేదు అని అన్నారు.
రిపోర్టులో ఎక్కడా చిత్రహింసలు, గాయపర్చడం కారణంగా జరిగాయని పేర్కొనలేదు అని తెలిపారు. రిపోర్టు అసంపూర్ణంగా ఉందని పేర్కొన్నారు. హైకోర్టు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. ముందు కింది కోర్టులో అప్లై చేసుకోవాలని చెప్పింది అని వ్యాఖ్యానించారు. రాజకీయంగా సున్నితమైన కేసుల్లో నేరుగా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన ఉదంతాలున్నాయి అని వివరించారు. రాజు రాజద్రోహానికి పాల్పడ్డాడా, ఆ సెక్షన్ వర్తిస్తుందా లేదా అన్నది ముందు కింది కోర్టు తేల్చాలన్నారు.