బాహుబలి 2 రికార్డులను తుడిచి పెట్టిన మళయాళ సినిమా..!

-

రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన బాహుబలి మొదటి, రెండు పార్టులు వసూళ్ల రికార్డులు ఇప్పుడప్పుడే ఏ సినిమా అందుకోలేదని అనుకున్నారు కాని బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేసి సూపర్ స్టార్ గా తన సత్తా చాటాడు మళయాళ హీరో మోహన్ లాల్. ఆయన నటించిన లూసిఫర్ సినిమా లాస్ట్ వీక్ రిలీజైంది. వారం రోజుల్లోనే వసూళ్లలో దుమ్ముదులిపేస్తుంది.

పృధ్విరాజ్ సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ఆంటోని నిర్మించారు. మోహన్ లాల్ సరసన మంజూ వారియర్ ఈ సినిమాలో నటించారు. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో వివేక్ ఒబెరాయ్ కూడా నటించడం విశేషం. మార్చి 28న రిలీజైన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే కేరళలో మాత్రం 6 రోజుల్లో 30 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇదవరకు బాహుబలి 2 కేరళలో 7 రోజుల్లో 30 కోట్లు రాబట్టింది. లూసిఫర్ సినిమా ఆ రికార్డ్ బ్రేక్ చేసింది.

ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 80 కోట్ల గ్రాస్ వసూళు చేసిన లూసిఫర్ సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు మోహన్ లాల్. పొలిటికల్ డ్రామాగా వచ్చిన లూసిఫర్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కథ, కథనాల్లో కొత్తగా ఉండటమే ఈ సినిమాకు ఇంత గొప్ప విజయాన్ని అందించాయని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news