మీనరాశి | ఉగాది పంచాంగం | శ్రీ వికారినామ సంవ‌త్స‌రం 2019 రాశి ఫ‌లాలు

శ్రీ వికారినామ సంవ‌త్స‌రం మీనరాశి రాశిఫ‌లాలు

పూర్వాభాద్ర-4వ పాదం, ఉత్తరాభాద్ర- నాలుగుపాదాలు, రేవతి- నాలుగు పాదాలు
ఆదాయం-2 వ్యయం-8
రాజపూజ్యం-1 అవమానం-7

ఈరాశివారికి ప్రధాన గ్రహసంచారం… గురువు ఉగాది నుంచి ఏప్రిల్ 22 వరకు, తిరిగి నవంబర్ 4 నుంచి దశమస్థానంలో సంచరిస్తాడు. ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు భాగ్యస్థానంలో ఉంటాడు. గురువు సంచారం వల్ల మంచి ఆలోచనలు, నిలిచిపోయిన పనులు పూర్తి, కొత్త జీవితం లభిస్తాయి. శని సంచారం దశమస్థానంలో ఉంటుంది, దీనివల్ల ఉద్యోగ, వ్యాపారాలు కలిసివస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు బాగావుంటాయి. దేవతానుగ్రహాన్ని పొందుతారు. రాహువు, కేతువులు కొంత అశాంతి కలిగిస్తారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి పనులు పూర్తిచేసుకోవాలి. చేసే పనిలో కొంత అనాసక్తి ఉంటుంది. దీని నివారణకు గణపతి ఆరాధన చేయండి.

Ugadi Panchangam 2019 Meena rashi Rashi Phalalu
Ugadi Panchangam 2019 Meena rashi Rashi Phalalu

గ్రహగతుల పరిశీలనతో ఫలితాలు పరిశీలిస్తే… సామాన్యంగా ఉంటుంది. ఇతరుల సహకారంతో పనులు పూర్తిచేసుకుంటారు. కుటుంబ, ఆర్థిక విషయాలు మెరుగుపడుతాయి. పుత్రసంతానం వల్ల అభివఋద్ధి. శత్రుకార్యమందు విజయం. ఆకస్మిక ధనలాభం, చేసేపనిలో అందరి మన్ననలు పొందుతారు. నిద్రలేమి, తలనొప్పి ఈ ఏడాది బాధించే అవకాశాలు ఉన్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యవసాయదారులకు రెండోపంట కలిసి వస్తుంది. విద్యార్థులకు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ రంగంలోని వారికి పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారులకు ఆదాయం బాగా ఉంటుంది. సినీరంగం, కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కంప్యూటర్ రంగం వారికి అంత అనుకూలం కాదు. రాజకీయనాయకులు పదవులు పొందుతారు. ఈరాశి స్త్రీలకు పాండిత్యం చేత ఇతరులను ఆకర్షించి అనేక పురస్కారాలు పొందుతారు. దత్తాత్రేయ సంబంధ పూజలు, దుర్గాదేవి ఆరాధన, పారాయణం, రామాయణ పుస్తక దానం మంచి ఫలితాలను ఇస్తాయి.


చైత్రమాసంలో అనవసరమైన చర్చలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పడినా చివ-రికి సంతృప్తికరంగా పూర్తవుతాయి. విద్యార్థులకు చదువు విషయంలో అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో ఉన్న వారికి అధికా-రుల ఆదరణ ఉంటుంది. వైశాఖ మాసంలో భార్యా-పిల్లలతో సంతృప్తిగా వుంటారు. జ్యేష్టమాసంలో అన-వసరమైన విషయాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లడం మంచిది. స్నేహితుల సహాయ సహకారాలతో పనులు నెరవేరు-తాయి. ఆషాఢ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలసట, అనారోగ్యము ఉంటాయి. పనులలో ఆలస్యము ఉంటుంది. కనుక పరిస్థితికి అనుకూలంగా ముందుకు వెళ్లడం మంచిది. శ్రావణ మాసంలో ప్రారంభించిన పనులు ఆటంకాలతో ముందుకు సాగుతాయి. శ్రమకు తగిన ఫలితాలు లేక-పోవడం. అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోవ-డము. భాద్రపద మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. స్వయంవృత్తిలో ఉన్న వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ఆశ్వీయుజంలో గ్రహాల ప్రతికూల సంచారంతో ఖర్చులు పెరుగు-తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడము. మానసిక ఆందోళనలు వుంటాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తులవుతారు. శుభకార్య ప్రయత్నాలు కొంత వరకు కలిసి వస్తాయి. కార్తీక మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఖర్చులకు తగిన ఆదాయము ఉంటుంది. మార్గశిర మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. భార్యా పిల్లలతో హాయిగా గడుపుతారు. స్వయంవృ-త్తిలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. పౌష్య మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ములు, బంధువుల సహాయ సహకారాలు ఉంటాయి. మాఘ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికస్థితి మెరుగు పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే చాలా విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఫాల్గుణ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అన్ని విషయాలలోనూ శుభ ఫలితాలు ఉంటాయి. ప్రారం-భించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురికి ఉపయోగపడే పనుల గురించి ఆలోచిస్తారు. వ్యాపా-రస్తులు రోజువారీ క్రయ విక్రయములలో లాభాలను పొందుతారు. స్వయం వృత్తి, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగములలో ఉన్నవారికి సానుకూలత ఉంటుంది.

– కేశవ

నోట్- వికారి నామ సంవత్సరంలో ఆయా రాశులకు చెప్పిన ఫలితాలు గోచారాలు మాత్రమే. ఆయా వ్యక్తులకు వీటి ద్వారా జరిగే మంచిచెడులను తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆనందంగా ఉండవచ్చు. అయితే ఇవి పూర్తిస్థాయి ఫలితాలు మాత్రం కావు. ఆయా వ్యక్తుల జనన సమయం, తేదీ, జన్మకుండలిని బట్టి పూర్తిస్థాయి జాతకాలను అంచనావేయాలి. అవి ఏవి తెలియనివారు గోచారాలను బట్టి వారి ప్రణాళికలను రూపొందించుకోవచ్చు, రెండు తెలిసినవారు జన్మ, గోచార ఫలాలను బట్టి భవిష్యత్‌లో జరిగే మంచిచెడులకు తగు జాగ్రత్తలతో ముందుకు పోవాలి. పూర్తిస్తాయి పరిహారాలు ఆయా గ్రహాలకు చేసుకోవాల్సిన ఉపహారాలు, పూజలు, వ్రతాలు, క్షేత్రసందర్శన కోసం మీ దగ్గర్లోని పండితులను, పురోహితులను సంప్రదించవచ్చు. చివరగా ఈ ఫలితాలు ఆయా శాస్ర్తాలో నిష్ణాతులను సంప్రదించి, నాకు తెలిసిన మేరకు, గురువుల అనుగ్రహం, దైవం చెప్పించిన మేరకు తెలిపాను. ఏ ఫలితం ఎలా ఉన్నా భగవద్గీతలో శ్రీకఋషుడు చెప్పిన విధంగా 100 శాతం నిజాయతీగా చేసేపనిని శక్తిమేరకు చేయండి. మీకు తప్పక విజయం లభిస్తుంది. లేనిదాని కోసం దురాశ పడకుండా.. ధర్మమార్గంలో ప్రయత్నం చేస్తూ వచ్చినంత దేవుడు ఇచ్చినాడు అన్న భావనతో ఇదం శరీరం పరోపకారం అనే ఆర్యసూక్తితో వికారి నామ సంవత్సరంలో పదిమందికి,లోకం కోసం కష్టపడుతూ మీ జీవనాన్ని సార్థకత చేసుకోవాలని ఆ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ… ఓం నమో వేంకటేశ్వరాయనమః
శుభం భూయాత్… మంగళం మహత్

– కేశవ

మిగ‌తా రాశుల‌ను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..

మేషం
మేషం
వృషభం
వృషభం
మిథునరాశి
మిథునరాశి
కర్కాటకం
కర్కాటకం
సింహం
సింహం
కన్య
కన్య
తుల
తుల
వృశ్చికం
వృశ్చికం
ధనుస్సు
ధనుస్సు
మకరం
మకరం
మీన‌రాశి
మీన‌రాశి
కుంభరాశి
కుంభరాశి