శ్రీ వికారి నామ సంవత్సరంలో 12 రాశుల భవిష్యత్ ఇలా ఉంది….!

శ్రీ వికారి నామ సంవత్సరంలో మీ భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకోండి!

తెలుగు కొత్త సంవత్సరం వికారి నామ సంవత్సరం శనివారం నుంచి ప్రారంభం. కొత్త పంచాంగాలు వచ్చాయి. పండితులు, పంచాంగ సిద్ధాంతులు ఆయా గ్రహాల గమనాలను లెక్కించి అందించారు. ఆయా గ్రహాలు సంచరించే స్థానాలతో ఆయా రాశుల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. 12 రాశుల సంక్షిప్త సంవత్సర ఫలితాలను వీక్షిస్తే…

 

మేషం : ఆదాయం-14, వ్యయం-14. రాజపూజ్యం-3, అవమానం-6. ఈరాశివారికి శని సంచారం వల్ల కింది ఉద్యోగుల సహాయసహకారాలు లభిస్తాయి. గురువు వల్ల ఆర్థిక విషయాఉల, మంచివారి సహకారం లభిస్తుంది. ఏడాది మాసాల వారిగా పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి మేషం…

వృషభం : ఆదాయం-8, వ్యయం-8. రాజపూజ్యం-6, అవమానం-6. ఈ రాశివారికి గురుబలం వల్ల గృహప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యాన్ని ఇస్తాడు. శని సంచారం వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. పూర్తి వివరాల కోసం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి వృషభం….

మిథునం: ఆదాయం-11, వ్యయం-2. రాజపూజ్యం-5, అవమానం-2. ఈరాశివారికి గురు ప్రభావం వల్ల స్వలాభం కంటే ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడుతారు. సామాజిక సంబంధాలు పెరుగుతాయి. పూర్తి వివరాల కోసం  ఇక్క‌డ క్లిక్ చేయండి మిథునం…

కర్కాటకం: ఆదాయం-5, వ్యయం-5. రాజపూజ్యం-5, అవమానం-2. ఈరాశివారికి గురు సంచారం వల్ల కృషిశీలత, సంతాన వృద్ధి ఉంటుంది. శని సంచారం వల్ల పోటీరంగంలో విజయావకాశాలు ఉంటాయి. 12 మాసాల ఫలితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి కర్కాటకం…

సింహరాశి: ఆదాయం-8, వ్యయం-14. రాజపూజ్యం-1, అవమానం-5. ఈరాశివారికి గురు ప్రభావం వల్ల సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. పూర్తి ఏడాది ఫలితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి సింహరాశి..


కన్యారాశి: ఆదాయం-11, వ్యయం-5. రాజపూజ్యం-4, అవమానం-5. ఈరాశి వారికి గురు ప్రభావం వల్ల కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. శని సంచారం వల్ల ఆకస్మిక వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. కార్యాల్లో అపకారం జరుగదు. పూర్తి ఫలితా విశ్లేషణ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి కన్యారాశి…..

తులారాశి: ఆదాయం-8, వ్యయం-8. రాజపూజ్యం-7, అవమానం-1. ఈరాశి వారికి గురు ప్రభావం వల్ల ఇంట్లో సంతోషం, సమాజంలో మాట విలువ పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు, ఇతరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పూర్తి ఏడాది ఫలితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి తులారాశి….

వృశ్చికరాశి: ఆదాయం-14, వ్యయం-14. రాజపూజ్యం-3, అవమానం-1. ఈరాశివారికి గురు సంచారం వల్ల మాట విలువ పెరుగుతుంది. శని సంచారం వల్లగౌ గౌరవం పెరుగుతుంది. తక్కువగా మాట్లాడితే మంచిది. పూర్తి ఏడాది ఫలితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి వృశ్చికరాశి….

ధనస్సురాశి: ఆదాయం-2, వ్యయం-8. రాజపూజ్యం-6, అవమానం-1. ఈరాశివారికి జన్మంలో గురువు ఉన్న సమయంలో ఇతరులక ఉపయోగపడే పనులు మీరు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జన్మంలో శని సంచారం వల్ల అనారోగ్యం సూచన, తర్వాత సేవకజన సహకారం లభిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి ధనస్సు…

మకరరాశి: ఆదాయం-5, వ్యయం-2. రాజపూజ్యం-2, అవమానం-4. ఈరాశివారికి వ్యయంలో గురు సంచారం వల్ల ఇతరుల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. నూతన గృహ కొనుగోలుకు అవకాశం ఉంది. శని సంచారం వల్ల ఇతరులు మిముల్ని మోసగించే అవకాశం కన్పిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను చివరి నిమిషంలో అధిగమిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి  మకరరాశి..

కుంభరాశి: ఆదాయం-5, వ్యయం-2. రాజపూజ్యం-5, అవమానం-4. ఈరాశివారికి గురువు ధనస్సులో సంచరించినప్పుడు ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉంటాయి. శని లాభస్థానంలో ఉండటం వల్ల అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉంటాయి. పూర్తి 12 మాసాల ఫలితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి కుంభరాశి….

మీనరాశి: ఆదాయం-2, వ్యయం-8. రాజపూజ్యం-1, అవమానం-7. ఈరాశివారికి గురువు దశమంలో సంచరిస్తున్న సమయంలో వృత్తిలో గౌరవం. అభివృద్ధికి అవకాశం ఉంటుంది. శని సంచారం వల్ల ఇతరుల మోసాన్ని జయిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి మీనరాశి….

– కేశవ

మిగ‌తా రాశుల‌ను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..

మేషం
మేషం
వృషభం
వృషభం
మిథునరాశి
మిథునరాశి
కర్కాటకం
కర్కాటకం
సింహం
సింహం
కన్య
కన్య
తుల
తుల
వృశ్చికం
వృశ్చికం
ధనుస్సు
ధనుస్సు
మకరం
మకరం
మీన‌రాశి
మీన‌రాశి
కుంభరాశి
కుంభరాశి