బాహుబలి నిర్మాత సంచలన వ్యాఖ్యలు …కరోనా ఎఫెక్టే కారణం ..!

-

కరోనా జీవితంలో జీవన విధానంలో ఊహించని మార్పులు తీసుకొచ్చింది. సామాన్యుడి దగ్గర్నుంచి సెలబ్రిటీస్ వరకు అందరికి భయం బాద్యత అంటే ఏంటో చూపించింది. అంతేకాదు కరోనా ప్రభావం దేశంలోని అన్నీ వ్యాపార రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీని ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అర్ధాంతరంగా ఆపేయడం.. అన్ని భాషల్లో రిలీజ్ అవ్వాల్సిన ఎన్నో సినిమాలను వాయిదా వేసుకోవడం తో నిర్మాతలకి బాగానే నష్టం వాటిల్లింది.

 

ముఖ్యంగా అన్నింటికంటే ముందు సినిమా థియేటర్లను మూసివేయాల్సి రావడంతో ఎంతో మంది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగా నష్టాల బారిన పడ్డారు. ఇక కరోనా పరిస్థితుల పై, రాబోయే సినిమా రిలీజ్ కి సంబంధి ప్రీ రిలీజ్ ఈవెంట్ లపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. కరోనా ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ మన అదృష్టం బాగుండి కరోనా ముగిస్తే.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో గతంలోని పరిస్థితులు ఫిల్మ్ మార్కెటింగ్ కుదరక పోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్బంగా ఆయన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘కొవిడ్ తర్వాత ఫిల్మ్ మార్కెటింగ్ ఎలా ఉండబోతోంది ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెటింగ్ ఎలా మారుతుందో అని ఆశ్చర్యపోతున్నా. ప్రీ-రిలీజ్ వేడుకలు ఆడియో విడుదల కార్యక్రమాలు థియేటర్స్ మాల్స్కు వెళ్లడం రోడ్ ట్రిప్లు.. ఇలాంటివి ఇకపై ఉండవు. సినిమా కార్యక్రమాలను నిర్వహించడం కుదరదు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ సంభాషణలు ఎక్కువగా జరుగుతాయి’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం శోభూ యార్లగడ్డ నిర్మిస్తున్న తాజా చిత్రం “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news