టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఆణిముత్యం ‘బాలరామాయణం’ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రంతో సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్ విజయవంతంగా 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం ట్విట్టర్ వేదికగా గుణశేఖర్ స్పందించారు. చిత్ర విశేషాలను గుర్తు చేసుకున్నారు.
తారక్ తో పాటు ఈ సినిమా ద్వారా ఇతరులు వెండితెరకు పరిచయమయ్యారని పేర్కొన్నారు. శబ్దాలయ థియేటర్స్ బ్యానర్ పై ఎంఎస్ రెడ్డి నిర్మాతగా సినిమా వచ్చిందని, ఈ పిక్చర్ ద్వారా రాముడిగా తారక్, సీత, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, రావణాసురుడు, హనుమంతులు..ఇలా చాలా మంది పిల్లలు సిల్వర్ స్క్రీన్ కు పరిచయమయ్యారని వివరించారు. ఈ సందర్భంగా వారందరికీ తన ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు గుణశేఖర్. పిక్చర్ కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్ చెప్పారు.
గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అప్పట్లో అద్భుతమైన గుర్తింపు లభించింది. భారత ప్రభుత్వం జాతీయ అవార్డు ఇచ్చి ప్రోత్సహించింది. ఈ సినిమా తర్వాత గుణశేఖర్ టాలీవుడ్ మెగస్టార్ చిరంజీవితో ‘చూడాలని ఉంది’ అనే సినిమా తీశారు. అది బాక్సాఫీసు వద్ద రికార్డులను తిరగరాసింది. ఇందులోని పాటలు హైలైట్‌గా నిలిచాయి.
గుణశేఖర్ చాలా కాలం తర్వాత ‘బాల రామాయణం’ మాదిరగా మరో పౌరాణిక గాథను తెరకెక్కించారు. బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ ప్లే చేసిన ‘శాకుంతలం’ చిత్రం పూర్తి కాగా, ఈ ఏడాది అది విడుదల కానుంది. ఆ సినిమానూ ఆదరించాలని ప్రేక్షకులను గుణశేఖర్ కోరారు. ‘హిరణ్యకశ్యప’ అనే సినిమానూ గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు.
On the occasion of #BalaRamayanam completing 25 years, Director #Gunasekhar garu expresses gratitude and thanks the audience with a heartfelt video.#25YearsForBalaRamayanam@tarak9999 @Gunasekhar1 #MSReddy#25YearsForBalaRamayanam pic.twitter.com/LGN1IXCHa6
— BA Raju's Team (@baraju_SuperHit) April 11, 2022