నల్ల శనగలు నానబెట్టిన నీటిని రోజూ తాగితే ఎన్ని ప్రయోజనాలో..!

-

శనగల్లో మంచి పోషకాలు ఉన్నాయి.. తింటే ఆరోగ్యానికి మంచిది ఇది అందరికి తెలుసు..శనగలు తినడానికి ముందు అందరు వాటిని నానపెడతారు..ఆ తర్వాత వాటిని క్లీన్ చేసి ఉడకపెడతారు. అలా ఏదో ఒకటి చేసుకుని తింటాం.. కానీ మీకు ఇక్కడ తెలియని ఇంకో విషయం ఉందిగా..! నల్ల శనగల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆ నానబెట్టిన నీళ్లలో ఎన్ని లాభాలో తెలుసా..?

ఈ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

నానబెట్టిన బ్లాక్ చనా వాటర్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నానబెట్టిన నల్ల శనగల్లో ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్‌లు ఉంటాయి. కాబట్టి శరీరంలోని అనేక సమస్యలను తొలగిస్తాయట.

నల్ల శనగలను రాత్రంతా నానబెట్టే ముందు నీటిలో బాగా కడిగి, ఒక గిన్నెలో వేసి రాత్రంతా నాననివ్వండి. ఉదయం లేవగానే ఈ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగితే చాలు. కావాలంటే కాస్త వేడి చేసి తాగండి. మీరు ఉప్పు ,నిమ్మరసంతో కూడా కలుపుకోవచ్చు.

మనం ఏదైనా వ్యాధి, వైరస్ నుండి విముక్తి పొందాలంటే రోగనిరోధక శక్తి బాడీకి చాలా అవసరం. అందుకోసం ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నల్ల శనగల నీటిని తాగవచ్చు. ఈ నీరు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం.. కానీ అవి మీకు అంత రిజల్ట్ ఇచ్చి ఉండకోవచ్చు. ఈ నీటిని తాగడం వల్ల విపరీతమైన అలసట, బలహీనత ఉండదు. అలాగే కడుపు నిండుతుంది. చాలాసేపటి ఆకలి వేస్తుంది. ఇది అతిగా తినడం నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది.

మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, మీ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి నల్ల శనగల నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఈ వాటర్ ఎప్పుడు? ఎలా? ఏ పరిమాణంలో తాగాలి ? అనే దానిపై నిపుణుల సలహా కోసం అడగండి.

అజీర్ణం, మలబద్ధకం సమస్య ఉంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. దీనితో పాటు గ్యాస్, అజీర్ణం, మంట వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

నానబెట్టిన నల్ల శనగల వాటర్ చర్మాన్ని అంతర్గతంగా శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. సహజమైన గ్లో , అందాన్ని పెంచుతుంది.

నల్ల శనగలను బాగా 2, 3 సార్లు నీటిలో కడిగి అవి మునిగిపోయేంత నీరు పోయాలి. తర్వాత రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. అంతే పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు హ్యాహీగా ఈ వాటర్ ను డైలీ తాగేయొచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news