బాలకృష్ణతో 100 కోట్ల సినిమా.. సాహసమే..!

-

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తాడట బాలకృష్ణ. అంతకుముందు వినాయక్ తో సినిమా ఉంటుందని అనుకోగా ఆ ప్రాజెక్ట్ వెనక్కి నెట్టేసి బోయపాటి సినిమాను ముందుకు తెచ్చాడట. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది.

ఇక ఈ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. బాలకృష్ణ సినిమాలు ఇప్పటివరకు 50 కోట్ల వసూళ్లనే రాబట్టలేదు మరి అలాంటిది 100 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. బోయపాటి శ్రీను ఈసారి బాలకృష్ణతో భారీ సినిమాకే ప్లాన్ చేశారట. ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా 80 కోట్ల దాకా బిజినెస్ జరుగుతుంది.

మరి దానికి మరో 20 కోట్లు ఎక్కువ బడ్కెట్ పెట్టేస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్ అంటే దానికి తగ్గట్టుగానే కథ, కాస్టింగ్ ఉంటుందని తెలుస్తుంది. మరి బోయపాటితో బాలయ్య చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news