తారక రత్న పరిస్థితి నిలకడగా ఉంది – బాలయ్య ప్రకటన

నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా .. అప్పటికే గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం పదిమంది వైద్య బృందంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా బాలయ్య.. తారక రత్న ఆరోగ్యంపై మీడియాతో స్పందించారు. తారక రత్న పరిస్థితి నిలకడగా ఉందని బాలయ్య ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. తారక్‌ ప్రస్తుతం కోమాలోనే ఉన్నాడని.. రేపటి వరకు కోలుకునే ఛాన్స్‌ ఉందన్నారు. స్టంట్స్‌ వేయడం కుదరడం లేదని.. అలా చేస్తే, మళ్లీ గుండె పోటు వస్తుందని డాక్టర్లు ఆ పని చేయలేదని వెల్లడించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నాం.. స్టంట్ వేయడం కుదరలేదు, మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించారు బాలకృష్ణ.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?