రామ్ చరణ్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడంటే..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోని రెండు తెలుగు రాష్ట్రాలలో యువత పొలిటికల్గా యాక్టివ్ అవ్వడానికి ఆయన తనవంతు కృషి చేస్తున్నారు. మంచి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంతో యువత మొత్తం ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతోంది. అంతకుముందే “సేవే లక్ష్యం..ప్రేమే మార్గం” అంటూ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి అట్టర్ ప్లాప్ అయ్యారు.. పవన్ కళ్యాణ్ అప్పుడు సొంత ఇమేజ్తో యాత్రను పూర్తి చేశారు. అప్పుడప్పుడే స్టార్డం తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రచారం చేశారు అయినా ఫలితం లేకపోయింది.

అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం కొంతమేరా పుంజుకుంది. దాంతో కుల సమీకరణలతో పాటు మరొకవైపు ఫ్యాన్స్ ను , యువతను ఓటర్లుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఈసారి యువతను అట్రాక్ట్ చేయడానికి బరిలోకి ఏకంగా రామ్ చరణ్ ను దించాలి అని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ ను ఈసారి ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. నిజానికి చిరంజీవిని పార్టీలోకి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆయన పార్టీలోకి చేరితే అది జనసేనకు చెడ్డ పేరు తీసుకొస్తుందని జనసేన నేతలు భావిస్తున్నారట. అందుకే ఆయనకు బదులు ఆయన తనయుడు రామ్ చరణ్ ను రాజకీయాల్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఎన్నికల కంటే కనీసం 6 నెలల ముందు రామ్ చరణ్ కి జనసేన కండువా కప్పాలని పవన్ కళ్యాణ్ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే సక్సెస్ అవుతాడా? లేక చతికిల పడతాడా? అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news