పెళ్లిళ్ల విషయంపై ట్రోల్ అవుతున్న బాలయ్య – పవన్ కళ్యాణ్..!

-

బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో పూర్తి కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి రెండో తేదీన ప్రసారం చేయగా.. ఇప్పుడు రెండవ భాగాన్ని కూడా స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమోనో విడుదల చేయగా అది చూసిన నెటిజన్స్ అటు బాలకృష్ణ ఇటు పవన్ కళ్యాణ్ పై పెళ్లి విషయం అడ్డుపెట్టుకొని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అన్ స్టాపబుల్ షో లో బాలయ్య పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లను సమర్ధించిన విషయం తెలిసిందే . ఇలా పవన్ 3 పెళ్లిళ్లపై విమర్శలు చేసే వారి గురించి కూడా బాలయ్య ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఊర కుక్కలు అంటూ బాలయ్య చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం పవన్ మూడు పెళ్లిలను సమర్ధించిన బాలయ్య.. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లిని ఎందుకు సమర్థించడం లేదు అని కూడా కామెంట్లు చేస్తున్నారు.. మరొకవైపు సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి వెనుక కారణాలు బాలయ్యకు తెలియనివి కాదు అని .. బయట వాళ్ళు తప్పు చేస్తే ఆదర్శంగా నిలుస్తారు.. ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే నిందిస్తారు అంటూ రకరకాలుగా బాలయ్య పై ట్రోల్ చేస్తున్నారు.

ఇకపోతే వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల తప్పని పరిస్థితిలో లక్ష్మీపార్వతిని సీనియర్ ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. ఇతర హీరోలతో పోలిక మాకు అవసరం లేదు అని సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లిని తీవ్రస్థాయిలో వ్యతిరేకించాల్సిన అవసరం ఏమొచ్చిందో బాలయ్య క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ సీఎం సీటుకు దూరం కావడానికి రెండో పెళ్లిని సాకుగా చూపించారని నెటిజన్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు .మరి దీనిపై బాలయ్య ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news