‘జబర్దస్త్’ నాగబాబుని ప్లేస్ లో టాలీవుడ్ కమెడియన్…!

-

ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షోని నాగబాబు వీడుతున్నాడు.. మరి ఆ ప్లేస్‌ని రిప్లేస్ చేసేది ఎవరు. టాలీవుడ్‌ కమేడియన్‌ నాగబాబు ప్లేస్‌లో రాబోతున్నాడని టాక్‌

ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై మంచి క్రేజ్ మరియు రేటింగ్స్ దూసుకెళ్తున్న షోల్లో ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి… కొన్నేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ షోకు ప్రేక్షకులనుండి విశేషమైన స్పందన లభించడంతో పాటు రేటింగ్స్ కూడా భారీగా వస్తుంటాయి. అయితే గత కొద్ది కాలంగా సక్సెస్ఫుల్ గా సాగుతున్న ఈ షోకు నటుడు నాగబాబు మరియు నటి రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా హఠాత్తుగా ఈ షో నుండి నాగబాబు తప్పుకుంటున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, జీ తెలుగు చానల్లో త్వరలో ప్రారంభం కాబోతున్న ‘సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ‘అనే సరికొత్త షోకు జడ్జిగా ఆయన వ్యవహరించబోతున్నారు.

అందుకోసం నాగబాబుకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ ముట్టినట్లు సమాచారం. ఇక అతి త్వరలో జబర్దస్త్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సరికొత్త షోలో కి నాగబాబు ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా సాగిన జబర్దస్త్ షో లో నాగబాబు కూడా మంచి క్రేజ్ ఉంది. మరి ఇలా హఠాత్తుగా ఆయన వెళ్ళిపోతే ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారు అంటూ గత కొద్ది రోజులుగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చలు జరుగుతున్నాయి.

Bandla Ganesh To Replace Naga Babu in Jabardasth Show
Bandla Ganesh To Replace Naga Babu in Jabardasth Show

కాగా నేడు కొన్ని వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం,ఈ షో లో నాగబాబు ప్లేస్ లో టాలీవుడ్ కమెడియన్ అయిన బండ్ల గణేష్ ని తీసుకునేందుకు జబర్దస్త్ టీం సిద్ధమైందని సమాచారం. ఈ మేరకు నిన్న ఈ షో యాజమాన్యం వారు బండ్ల గణేష్ ని కలవడం జరిగిందట, అయితే బండ్ల మాత్రం తనకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని చెప్పినట్లు సమాచారం. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి బండ్ల గణేష్ జబర్దస్త్ కు జడ్జిగా రావటం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది…!!

Read more RELATED
Recommended to you

Latest news