తలపతి విజయ్ ‘ బీస్ట్’ ట్రైలర్ రిలీజ్… విజయ్ నుంచి మరో యాక్షన్ ఎంటర్ టైనర్

-

మచ్ అవైయిటెడ్ మూవీ తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ ‘ బీస్ట్ ’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా తమిళ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో విజయ్ సోల్జర్ గా కనిపించబోతున్నారు. ట్రైలర్ మొదలవ్వడమే ఓ హైజాక్ సిచ్యువేషన్ తో ప్రారంభం అవుతుంది. ఆ తరువాత విజయ్ ఇంట్రడక్షన్ మాత్రం మామూలుగా లేదు. విజమ్ ఫ్యాన్స్ కు ట్రైలర్ చూస్తే.. పునాకాలు గ్యారెంటీ. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘ బీస్ట్’ మూవీ రానుంది. విజయ్ సూపర్ యాక్షన్, స్టైలిష్ ఫెర్ఫామెన్స్ సినిమాపై మరింతగా హైప్ పెంచుతున్నాయి. ఫైటింగ్ సీన్లలో విజయ్ అదరగొట్టాడు. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందనే భారీ అంచనాలను పెంచింది ట్రైలర్.

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న బీస్ట్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మించింది. విజయ్ కు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మరో ముఖ్యపాత్రలో డైరెక్టర్ సెల్వరాఘవన్ కనిపించనున్నారు. ఇప్పటికే అనిరుథ్్ అందించన మ్యూజిక్ సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. ‘ అరబిక్ కుతు’ సాంగ్ రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news