బేబమ్మ ఎలా ఉంటుంది
ఎలా ఉంది అని రాయాలి
దేవుడు ఇచ్చిన బేబమ్మ ఎలా ఉంటుంది
దేవుడి గుడిలో బేబమ్మ ఎలా ఉంటుంది
పోత పోసిన అందంలా ఉంటుంది..దీపశిఖ చెంత వెలుగు రేఖలు అందుకుని ఉంటుంది.నుదిటి రేఖల చెంత విభూది దిద్దుకున్న విధంగా ఉంటుంది.ఇంకా ఏవేవో ఎన్నో! అందుకే ఈ ఉదయాలు ఆ సాయంత్రాలూ అన్నీ కూడా బేబమ్మ ప్రేమలోనే..ఆ వెచ్చింపు కోసం ఉన్న కాలం అంతా సరిపోవడం లేదు అన్నది యవ్వన ప్రాయం చేస్తున్న ప్రతిపాదన.
ప్రేమ ఎలా ఉంటుంది..ఎక్కడయినా ఎప్పుడయినా ఒకేలా ఉంటుంది అని అనుకోవడం తప్పు. మనిషి ఎలా ఉంటాడు. ఎక్కడయినా,ఎప్పుడయినా ఒకేలా ఉంటాడు అని అనుకోవడం భ్రమ.ప్రేమతో పాటే మనిషి..మనిషితో పాటే మనసు.ఏవి ఎలా ఉండాలో అలానే ఉండాలి.ఉండడం స్థితి..ఉంచడం ప్రయత్నం.ఉంచాలని తపించడం సంకల్పం..ఉంచేందుకు చేసే ప్రయత్నంలో మనిషి తనని తాని నిగ్రహించి,ఉన్నత స్థితికి చేరుకోవడమే ఆవశ్యక పరిణామం.
అందుకే ప్రేమ..ఓ ఉప్పెన..ఒక్కసారే ఈ ఉప్పెన..ఆయనేంటి ఊపిరి అంతా ఉప్పెనే..అంటే ఒప్పుకుంటామా..ప్రాయాల పరిశ్రమలన్నీ..ఇలాంటి ఊహాపాతాలను తట్టుకుని పోయి..ఒకానొక గాలి సవ్వడులను తాకి మురిసిపోయి..ఇలానే ఎలానో ఆమె దగ్గరకు నన్నుచేర్చిన చాలు..అది కదా! ప్రేమంటే..పాట వింటూ వింటూ ఆ కొత్త సోయగాల చెంత…అండ్ ద సాంగ్ ఈజ్ నీ కళ్లు నీలి సముద్రం..నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..నీ నవ్వు ముత్యాల హారం..నన్ను తీరానికి చేర్చేటి దారం దారం..
దేవుడు ఇచ్చిన వరం..దేవుడి నుంచి పొందిన జన్మం అన్నీ కూడా ప్రేమ పూర్వక ఆదరాలు అందుకే ప్రేమ నుంచి ప్రేమ వరకూ మనిషి ఏ విధంగా ఉన్నాడు అన్నది ఓ ఆరా! అందుకే ఏ సినిమా అయినా ఏ కథ అయినా సుఖాంతాలను కోరుకుని మనిషిని సాంత్వన పరుస్తుంది. కానీ జీవితం అలా ఉంటుందా? ఉండదు కనుకనే అన్ని ప్రేమలూ తీరానికి చేరవు.కానీ బేబమ్మ ప్రేమలో తీరాలు ఉన్నాయి..ఆ..తీరాలను చేరుకున్నాక మనసుకు సాంత్వన మరియు ఆనందమే! అందుకే ఈ ఉదయం ఈ సాయంత్రం అన్ని వేళలూ అన్ని సమయాలూ ఆమె ప్రేమ వెచ్చింపులోనే…నౌ బ్యూటీ స్పీక్స్ ఎలాట్…
– బ్యూటీస్పీక్స్ – మన లోకం ప్రత్యేకం