అందరూ డాక్టర్ కాబోయ్ యాక్టర్ అవుతారు. కానీ అఖిల్ క్రికెటర్ కాబోయ్ యాక్టర్ అయ్యాడని అందరికి తెలిసిందే. ఐదేళ్ల వయసు నుంచే బ్యాట్ పట్టాడు. ఆ ఫ్యాషన్ ను గుర్తించిన తండ్రి నాగార్జున ఎలాగైనా క్రికెటర్ ని చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసారు. అమల కూడా తనయుడికి క్రిఎకెటర్ గానే చూడాలనుకున్నారు. అందుకే దాదాపు 20 ఏళ్ల పాటు అఖిల్ ను ఆస్ర్టేలియాలో ఉంచారు. అక్కడ బెస్ట్ స్కూల్ కమ్ స్పోర్స్ట్ అకాడమీలో జాయిన్ చేసారు. అసిస్ లాంటి ప్లేయర్ ను సిద్దం చేయాలనే అఖిల్ ను అక్కడ పెట్టి చదువుతోపాటు క్రికెట్ లో శిక్షణ ఇప్పించాడని చాలా తక్కువ మందికే తెలుసు. కానీ అఖిల్ కనీసం రంజీలకు కూడా సెలక్ట్ కాలేదు. అందుకు ఎన్నో రకాల కారణాలు ఉంటాయనుకోండి.
మంచి బ్యాట్స్ మన్ గా ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్నా క్రికెటర్ గా రాణించలేకపోయాడు. క్రికెటర్ కాలేకపోయాడని అక్కినేని ఫ్యామిలీ ఇప్పటికీ బాధ పడుతుంది. అందుకే అప్పుడప్పుడు అఖిల్ తన ఫ్యాషన్ ని సీసీఎల్ చూపిస్తుంటాడు. తాజాగా అఖిల్ 20 ఏళ్ల కెరీర్ కి అయిన ఖర్చు ఎంత. అంటే అక్షరాలు 15 కోట్లు సమాచారం. దాదాపు క్రికెట్ కోసం 5 కోట్లకు పైగా ఖర్చు చేసారుట. మిగతా ఖర్చులు ఆస్ర్టేలియాలో ఉన్నందకు అని తెలుస్తోంది. క్రికెటర్ కావాలని ఇప్పటివరకూ ఏ క్రికెటర్ ఇంత ఖర్చు చేయలేదు. చాలా మంది ప్లేయర్స్ కింది స్థానాల నుంచి ఉన్నత క్రికెటర్లగా ఎదిగారు. గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ క్రికెటర్ వరకూ ఎంతో మంది ఎదిగారు.
అంతర్జాతీయ స్థాయి జట్టులో స్థానం సంపాదించారు. కానీ అకిల్ కనీసం రంజీకి కూడా సెలక్ట్ కాకపోవడం వెనుక అతని అలసత్వమే ప్రధాన కారణమై ఉంటుందని తెలుస్తోంది. అలాగే నాగార్జునకు అకిల్ కారణంగా 15 కోట్లు లాస్ అని అర్ధమవుతోంది. ఇక క్రికెట్ కు వయసు కూడా మించి పోవడంతో లాభం లేదని ఇండియా తిరిగొచ్చి టాలీవుడ్ లోయాక్టర్ అయ్యాడు. ప్రస్తుతం అక్కడా అతని ఫేజ్ ఏమాత్రం బాగోలేదు. ఇప్పటివరకూ నటించిన మూడు సినిమాలు హ్యాట్రిక్ ప్లాప్ లు అందుకున్నాయి. ప్రస్తుతం నాల్గవ సినిమా ను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.