టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడమే కాకుండా చనిపోయే ముందు అమలతో ఏఎన్ఆర్ ఏం మాట్లాడారు అనే ప్రతి విషయాన్ని కూడా ఆమె మీడియాతో పంచుకుంది.
అమల మాట్లాడుతూ.. మామగారు చిత్ర పరిశ్రమ కోసం తన చివరి శ్వాస వరకు శ్రమిస్తూనే ఉన్నారు. ఒకవైపు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూనే మరొకవైపు మనం సినిమాకి పనిచేశారు అని అమల వెల్లడించింది. ఇక ఆసుపత్రి లో చికిత్స పొందుతూ.. బెడ్ పైనుంచి మామగారు మనం మూవీకి డబ్బింగ్ చెప్పారని అమలా తెలిపింది.. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ ఆశీర్వాదం వల్లే ఇన్ని సంవత్సరాలు సంతోషంగా జీవించానని ఏఎన్ఆర్ చెప్పినట్టు అమల తెలిపింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సమయంలో మీరు విచారించవద్దని ఆయన అమలతో చెప్పినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే మనం మనల్ని ప్రేమించుకోవడం లేదని , పర్యావరణాన్ని ప్రేమించడం లేదని ఇలా చేయడం వల్లే క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తోందని అమల వెల్లడించింది.
ముఖ్యంగా పురుగులు మందులు, రసాయనాలు ఉపయోగించిన ఆహార పదార్థాలను మనం ఎక్కువగా తీసుకుంటున్నాము. ఆర్గానిక్ ఫార్మేషన్ తో పండించే ఏ పంట కూడా ఎవరి దగ్గరకు చేరడం లేదు. అందుకే ఇలాంటి రోగాలు చుట్టు ముడుతున్నాయి. సాధ్యమైనంతవరకు మాంసాహారానికి దూరంగా ఉండండి. శాఖాహారాన్ని స్వయంగా ఆర్గానిక్ పద్ధతుల ద్వారా పండించినవి మాత్రమే తీసుకోండి అంటూ ప్రతి ఒక్కరికి తెలిపింది. ఇకపోతే అక్కినేని కుటుంబంలో అమలపాత్ర ఒక ప్రధానమైనదని చెప్పవచ్చు. ఇక కుటుంబానికే పరిమితమైన ఈమె కొన్ని స్వచ్ఛంద సంస్థలలో పనిచేస్తోంది. విదేశీయులైనప్పటికీ తెలుగింటి కోడలిగా చక్కగా తన బాధ్యతలను నెరవేరుస్తూ ఉత్తమ కోడలుగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.