అతన్ని ‘కవచం’ కాపాడుతుందా

-

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నాలుగు సినిమాలు చేశాడు. మొదటి సినిమా అల్లుడు శీను నుండి లాస్ట్ మూవీ సాక్ష్యం వరకు అతని సినిమాల బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇక ఇప్పుడు తేజ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర రిలీజైంది. కవచం టైటిల్ తో ఈ సినిమా వస్తుంది.

సినిమాలో శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. బెల్లంకొండ బాబు పక్కన నటించేందుకు అమ్మడు భారీగానే డిమాండ్ చేసిందని తెలుస్తుంది. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ తో కవచం అంటూ వచ్చాడు బెల్లంకొండ బాబు. మరి ఈ సినిమా అయినా అతనికి హిట్ అందిస్తుందో లేదో చూడాలి.

వంశీ ధారా క్రియేషన్స్ లో శ్రీనివాస్ మామిళ్ల నిర్మిస్తున్న ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు. ప్రభాస్ సాహో సినిమాలో కూడా ఇతను విలన్ గా నటిస్తున్నాడు. కవచం ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ కానుందట్. నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version