ఓరి నీబండబడ.. నామినేషన్ కు అన్నీ రూపాయి బిళ్లలు తీసుకెళ్లాడు..!

-


ఇది ఎన్నికల సీజన్. ఇప్పుడే కాదు.. వచ్చే సంవత్సరం జూన్ వరకు ఎన్నికలే ఎన్నికలు. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. ఇక.. మధ్యప్రదేశ్ లో నవంబర్ 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కదా. దాని కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు ఎన్నికల అధికారలు. ఓ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్లాడు. నామినేషన్ ఫారం నింపిన తర్వాత రిటర్నింగ్ అధికారికి డిపాజిట్ ఎమౌంట్ ఇచ్చాడు. అందరిలా మామూలుగా డిపాజిట్ ఎమౌంట్ ఇస్తే ఇప్పుడు మనం అతడి గురించి మాట్లాడుకునేవాళ్లమే కాదు. ఆ అభ్యర్థి ఏకంగా పది వేల రూపాయి బిళ్లలు సమర్పించాడు. పెద్ద సంచిలో వాటిని మోసుకెళ్లి రిటర్నింగ్ అధికారికి అందజేశాడు.

ఓరిదేవుడోయ్.. వీడేందిరా బాబు.. అన్ని రూపాయి బిళ్లలు తెచ్చాడు అని మనసులో అనుకున్న ఆ అధికారి.. ఐదుగురు సిబ్బందిని నియమించి మరీ.. వాటిని లెక్కబెట్టించాడట. వాటిని లెక్కించడానికి గంటన్నర పట్టిందట. ఆ సిబ్బంది కూడా ఈ రూపాయి బిళ్లలేందిరా బాబు అంటూ తలపట్టుకున్నారట. అయితే.. ఆ అభ్యర్థి ఇలా రూపాయి బిళ్లలు డిపాజిట్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉందండోయ్. అవన్నీ విరాళాలలట. అవును.. ఇండోర్ 3 నుంచి పోటీ చేస్తున్న దీపక్ పవార్ కు ప్రజల నుంచి వచ్చిన విరాళాలు అట అవి. వాటిని నోట్లుగా మార్చకుండా అలాగే చిల్లరను సమర్పించాడట. అది సంగతి. మధ్య ప్రదేశ్ లో నవంబర్ 28న పోలింగ్ జరగనుండగా… డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version